న్యూ హాంప్​షైర్​లో ట్రంప్ ​ఘనవిజయం

న్యూ హాంప్​షైర్​లో ట్రంప్ ​ఘనవిజయం

వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెన్షియల్ ప్రైమరీ పోటీల్లో మాజీ ప్రెసిడెంట్ ​డొనాల్డ్ ట్రంప్​హవా కొనసాగుతోంది. ఇటీవల అయోవాలో విజయం సాధించిన ఆయన బుధవారం జరిగిన న్యూ హాంప్​షైర్ ​రాష్ట్ర ప్రైమరీలో భారీ అధిక్యంతో గెలిచారు. నిక్కీ హేలీపై స్పష్టమైన మెజారిటీ సాధించారు. ట్రంప్​ దాదాపు 55% ఓట్లు గెలుచుకున్నారు. ఈ ఫలితాలు పార్టీపై ట్రంప్ పట్టు స్పష్టం చేస్తున్నాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

విజయం తర్వాత ట్రంప్ మాట్లాడుతూ హేలీకి ఇది చాలా బ్యాడ్ నైట్.. ఆమె ఓడిపోయి కూడా గెలిచినట్లుగా మాట్లాడుతున్నారని అని ఎద్దేవా చేశారు. ఆమె ఒక రకమైన చిత్తభ్రాంతిలో ఉన్నారని విమర్శించారు. కాగా, ఈ ప్రైమరీకి ముందు మంగళవారం రాత్రి న్యూ హాంప్​షైర్​లో నిక్కీ ప్రసంగిస్తూ.. ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయితే అది డెమొక్రాట్​నేతలు బైడెన్ లేదా కమలా హ్యారిస్ గెలుపుకు దారితీస్తుందని హెచ్చరించారు.