ఎంఎస్ఎంఈల కోసం.. ఇన్డీ యాప్

ఎంఎస్ఎంఈల కోసం.. ఇన్డీ యాప్

హైదరాబాద్​, వెలుగు:  ఎంఎస్​ఎంఈలకోసం ఇన్​డీ యాప్ ను నేషనల్ ఇండస్ట్రీస్ రీసెర్చ్ డెవలప్‌‌‌‌మెంట్ కౌన్సిల్ అభివృద్ధి చేసింది. వ్యవస్థాపకుల మధ్య నెట్‌‌‌‌వర్కింగ్‌‌‌‌ కోసం, వ్యాపారంలో సహాయం చేయడానికి, ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవడానికి ఇది సింగిల్ -విండో ప్లాట్‌‌‌‌ఫారమ్​గా పనిచేస్తుంది. 

ఎంఎస్​ఎంఈల  పరిధిని పెంచడం, భారతీయ బ్రాండ్‌‌‌‌లను అంతర్జాతీయంగా పోటీ పడేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్​డీయాప్ బీ2బీ మార్కెట్‌‌‌‌ప్లేస్‌‌‌‌గానూ పనిచేస్తుంది.