
హైదరాబాద్సిటీ, వెలుగు: కాచిగూడ – జోధ్‌పూర్ మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును శనివారం నుంచి ప్రారంభిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ , బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సాయంత్రం 5.30 గంటలకు జెండా ఊపి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ రైలు వల్ల రాజస్థానీ ప్రజలకు, హైదరాబాద్ వాసులకు ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని నాందేడ్, వాషిమ్, ఉజ్జయిని, రత్లం, నీమచ్, చిత్తౌర్‌గఢ్, భిల్వారా, అజ్మీర్, పాలి మార్వార్ వంటి ఇతర ప్రధాన నగరాలకు వెళ్లవచ్చన్నారు. రిజర్వేషన్, అన్ రిజర్వ్ విభాగాలతో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందన్నారు.
చెర్లపల్లి – తిరుపతి వీక్లీ ట్రైన్స్
చర్లపల్లి, తిరుపతి మధ్య 8 ప్రత్యేక వీక్లీ రైళ్లను ప్రవేశపెట్టినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఆగస్టు 3 నుంచి 24 వరకు ప్రతీ ఆదివారం 4 సర్వీసులు, ఆగస్టు 4 నుంచి 25 వరకు ప్రతీ సోమవారం 4 సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లకు రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గూటీ, డోన్, కర్నూల్సిటీ, గద్వాల్, వనపర్తిరోడ్, మహబూబ్నగర్, జడ్చర్ల, షాద్నగర్, ఉమ్దానగర్, కాచిగూడ స్టేషన్ల మధ్య స్టాప్ ఉంటుందని పేర్కొన్నారు.