హైదరాబాద్, వెలుగు: దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీదారు కియా మనదేశంలో ఈవీ9, కార్నివాల్ లిమోజిన్లను లాంచ్చేసింది. ఈవీ9 కారును ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 24 నిమిషాల్లో 80 శాతం చార్జ్ చేయవచ్చు. ఇది 5.3 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇందులో 24 అటానమస్ అడాస్ ఫీచర్లు, 10 ఎయిర్ బ్యాగ్స్వంటి ప్రత్యేకతలు ఉంటాయి.
‘ఈవీ9’ కారు 99.8 కిలోవాట్ల బ్యాటరీతో వస్తుంది. ఇది సుమారు 561 కిలోమీటర్ల మైలేజ్ఇస్తుంది. ధర రూ.1.30 కోట్లు. కార్నివాల్ లిమోజిన్కు స్మార్ట్ స్ట్రామ్ 2.2 లీటర్స్ 4 సిలిండర్ ఇంజన్‌ను అమర్చారు. ఈ కారు 193 పీఎస్ పవర్, 441 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. విశాలమైన ఇంటీరియర్, హై-ఎండ్ ఆడియో సిస్టమ్, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ధర రూ.63 లక్షల నుంచి మొదలవుతుంది.