
- దళిత బంధుతో కొత్త వెలుగులు వస్తయ్
- దేశానికే దారి చూపేలా పథకం అమలు
- నేటి నుంచే రూ. 50 వేల వరకు రైతు రుణాలు మాఫీ
- ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తవగానే ఉద్యోగాల భర్తీ
- చేనేత బీమా తెస్తం స్వాతంత్య్ర వేడుకల్లో కేసీఆర్
- వివక్షకు గురైనోళ్లను పారిశ్రామికవేత్తలుగా మార్చుతం: సీఎం
ఈర్ష్య, అసూయలకు తావివ్వకుండా అందరూ ఒక్క తాటిమీద నిలవాలి. దళిత సమాజానికి ఒక నమ్మకాన్ని ఇవ్వాలి. కులం పేరిట నిర్మించిన ఇనుపగోడలను, ఇరుకు మనస్తత్వాలను బద్దలు కొట్టాలి. దళితజాతి సమగ్ర వికాసం కోసం ఇప్పటివరకూ జరిగింది ఒక ఎత్తయితే, ఇప్పుడు జరగబోయేది ఇంకో ఎత్తు అనే విధంగా ప్రభుత్వం దళితబంధు ఉద్యమానికి నాంది పలుకుతున్నది.‑ సీఎం కేసీఆర్
హైదరాబాద్, వెలుగు: కులం పేరుతో నిర్మించిన ఇనుప గోడలు, ఇరుకు మనస్తత్వాలను బద్దలు కొడుతామని, అణగారిన దళిత సమాజం స్వశక్తితో బతికేలా తీర్చిదిద్దేందుకే దళితబంధు పథకం తీసుకువచ్చామని సీఎం కేసీఆర్ అన్నారు. ఇంతకాలం వివక్షకు గురైనోళ్లు వ్యాపారులుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించేలా చూస్తామని తెలిపారు. ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో ఆయన జాతీయ పతకాన్ని ఎగరేసిన తర్వాత మాట్లాడారు. దళితజాతిని ప్రత్యేక శ్రద్ధతో ఆదుకోవడం ప్రధాన బాధ్యత అని, అది ప్రజాస్వామిక ప్రభుత్వాలు తప్పనిసరిగా చేయాల్సిన పని అని చెప్పారు.
నేనే దళిత బంధును రూపొందించిన
స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా దళితుల జీవితాల్లో చీకటి తొలగలేదని సీఎం కేసీఆర్ అన్నారు. దేహంలో కొంతభాగాన్ని ఖండిస్తే కుప్పకూలుతుందని, ఒక పెద్ద ప్రజాసమూహాన్ని అణచివేస్తే దేశం కూడా కుప్పకూలుతుందనే నిజాన్ని గ్రహించాలని చెప్పారు. దళితుల్లో విద్యావికాసం కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు, మహిళల కోసం డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. ఎస్సీ ప్రగతి నిధికి కేటాయించిన నిధులు ఖర్చు చేయకుంటే మరుసటి ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నామన్నారు. దళితులను ఆర్థికంగా బలోపేతం చేసి వివక్ష నుంచి వారికి విముక్తి కల్పించడమే ధ్యేయంగా తానే స్వయంగా దళితబంధు పథకానికి రూపకల్పన చేశానని, ఇది దళితుల జీవితాల్లో కొత్త వెలుగులను తీసుకువస్తుందని చెప్పారు.
బడ్జెట్‌లోనే దళితబంధు అమలుకు నిధులు కేటాయించామని, దీనిని పైలట్ ప్రాజెక్టుగా సోమవారం హుజూరాబాద్ నియోజకవర్గంలో పూర్తిగా, మిగిలిన నియోజవర్గాల్లో పాక్షికంగా అమలు చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వం లైసెన్స్‌లు ఇచ్చే ఫెర్టిలైజర్లు, మెడికల్ షాపులు, హాస్పిటళ్లు, హాస్టళ్లకు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టులు, వైన్, బార్ షాపుల్లో దళితులకు ప్రత్యేక రిజర్వేషన్ తీసుకువస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో దళిత బంధు పథకం దేశానికే దారి చూపుతుందని, తద్వారా దేశంలోని దళితుల జీవనగతిని మార్చేసే ఉజ్వల పథకంగా చరిత్రకెక్కుతుందన్నారు.
నేటి నుంచి రుణమాఫీ
రైతులకు 50 వేల రూపాయల వరకు ఉన్న బ్యాంక్ లోన్లను సోమవారం నుంచి మాఫీ చేస్తున్నామని సీఎం చెప్పారు. ఇప్పటికే రూ. 25 వేల లోపు ఉన్న లోన్లు మాఫీ చేశామన్నారు. ఈనెలాఖరుకు 9 లక్షల మంది రైతులు రుణ విముక్తులవుతారని తెలిపారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించడానికి హైదరాబాద్ మినహా పాత 9 జిల్లాల పరిధిలో రైస్ మిల్లులు, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ధరణి పోర్టల్‌లో భూ రికార్డులు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ప్రగతికి నిరోధకంగా మారిన వీఆర్వో వ్యవస్థను తొలగించామని చెప్పారు.
కరోనా కన్నా.. భయంతోనే ఎక్కువ మంది చనిపోయిండ్రు
కరోనా ఎన్ని కష్టనష్టాలు కల్పిస్తున్నా, వాటిని అధిగమిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని రక్షిస్తున్నామని, ప్రాణాలు కాపాడేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నామని సీఎం తెలిపారు. వ్యాధి కన్నా కరోనా భయంతోనే చాలా మంది చనిపోతున్నారని తెలిసి తానే స్వయంగా హైదరాబాద్, వరంగల్ హాస్పిటళ్లను సందర్శించి అక్కడి రోగులతో మాట్లాడి వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశానన్నారు. ప్రభుత్వపరంగా వైద్య సేవలను మరింత ఎక్కువగా అందుబాటులోకి తెచ్చామని ఆయన తెలిపారు. డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో 50కి పైగా టెస్టులు ఉచితంగా చేస్తామన్నారు. బస్తీ దవాఖానాల తరహాలోనే పల్లె దవాఖానలు ఏర్పాటు చేస్తున్నామని, హెల్త్ సబ్ సెంటర్లలో డాక్టర్లను అందుబాటులోకి తెస్తామని, ఇందుకోసం పెద్ద ఎత్తున డాక్టర్లను రిక్రూట్ చేస్తామని తెలిపారు. ప్రజల హెల్త్ ప్రొఫైల్ రూపొందించే పనిలో నిమగ్నమయ్యామని చెప్పారు. రాష్ట్రంలో కరోనా అదుపులో ఉందని, మూడో వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తుండటంతో దానిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, కొవిడ్ రూల్స్ కచ్చితంగా పాటించాలని సూచించారు.
95 శాతం ఉద్యోగాలు స్థానికులకే
రాష్ట్రంలో భర్తీ చేయబోయే ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే దక్కుతాయని సీఎం తెలిపారు. ఇందుకోసం కేంద్రంతో నెలల తరబడి చర్చించి కొత్త జోనల్ వ్యవస్థ తీసుకువచ్చామన్నారు. ఇందుకు తగ్గట్టు కొత్త జిల్లాల వారీగా పోస్టులు, ఉద్యోగుల విభజన ప్రక్రియ చేపట్టామన్నారు. ఈ ప్రక్రియ పూర్తవగానే ఉద్యోగాల భర్తీ చేపడుతామన్నారు. చేపలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని, గొర్రెల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉన్నామని తెలిపారు. టీఎస్ ఐపాస్ విధానంతో పరిశ్రమల స్థాపనకు యావత్ ప్రపంచం తెలంగాణ వైపు చూస్తోందని సీఎం చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి రూ.2.2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఏడేండ్లలో 16,671 కొత్త పరిశ్రమలు తరలివచ్చాయన్నారు. వాటి ద్వారా 15.86 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఐటీ రంగం ఎదురులేని విధంగా దూసుకుపోతోందని, పారిశ్రామిక ప్రగతిలో ముందున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అడుగడుగునా ఫ్లై ఓవర్లు, స్కై వాక్‌లు నిర్మిస్తున్నామని చెప్పారు. నగరం విస్తరిస్తుండటంతో ఓఆర్‌ఆర్ అవతల రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించాలని నిర్ణయించామన్నారు.
సంక్షేమ పథకం చేరని ఇల్లు లేదు
రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకం చేరని ఇల్లు లేదని సీఎం కేసీఆర్ అన్నారు. రూ. 200 ఉన్న పింఛన్‌ను రూ. 2,016కు పెంచి నిజమైన చేయూతనిస్తున్నామని తెలిపారు. వృద్ధాప్య పింఛన్ అర్హత వయసు 57 ఏండ్లకు తగ్గించి అండగా నిలుస్తున్నామన్నారు. చేనేత కార్మికులను ఆదుకోవడానికి అనేక పథకాలు అందిస్తున్నామని, వారి కోసం రైతుబీమా తరహాలోనే చేనేత బీమా అమలు చేయబోతున్నామని చెప్పారు. చేనేతరంగాన్ని ఆదుకోవడానికి ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు. పేదల సొంతింటి కల తీర్చడంతో పాటు గౌరవప్రదమైన నివాసం కల్పించాలనే డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని, చివరి లబ్ధిదారుడికి అందే వరకు ఈ పథకం కొనసాగుతుందని చెప్పారు. కొత్తగా మూడు లక్షలకు పైగా రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభించడం గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. యాదాద్రి థర్మల్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందన్నారు. రాష్ట్ర జీఎస్‌డీపీలో 20 శాతం ఆదాయం వ్యవసాయం నుంచే సమకూరుతున్నదని తెలిపారు. రాష్ట్రం భవిష్యత్‌లో ఇంకా ఎన్నో అద్భుతాలు సృష్టించి అనేక ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుందని, ఆశించిన గమ్యం చేరుకోవడానికి వాక్ శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధితో పనిచేస్తున్నామన్నారు.
శ్రీశ్రీ పాటతో ప్రసంగం ప్రారంభం
దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ సీఎం కేసీఆర్ ప్రసంగం ప్రారంభించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి నివాళులర్పిస్తున్నానని తెలిపారు. ఈ 75 ఏండ్లలో సాధించిందేమిటీ.. సాధించాల్సింది ఏమిటో మదింపు చేసుకోవాలన్నారు. దేశం అనేక రంగాల్లో కొంతమేరకు పురోగమిస్తున్నా, చాలా రాష్ట్రాల్లో ప్రజలు కనీస అవసరాల కోసం కొట్టుమిట్టాడుతున్న దుస్థితి ఉందన్నారు. ‘‘స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి, సంబరపడగానే సరిపోదోయి, సాధించిన దానికి సంతృప్తిని చెంది, అదే విజయమనుకుంటే పొరపాటోయి” అన్న మహాకవి శ్రీ శ్రీ పాటను ఇప్పటికీ మనం అన్వయించుకోవాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు.
బడ్జెట్‌లోనే దళితబంధు అమలుకు నిధులు కేటాయించామని, దీనిని పైలట్ ప్రాజెక్టుగా సోమవారం హుజూరాబాద్ నియోజకవర్గంలో పూర్తిగా, మిగిలిన నియోజవర్గాల్లో పాక్షికంగా అమలు చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వం లైసెన్స్ లు ఇచ్చే ఫెర్టిలైజర్లు, మెడికల్ షాపులు, హాస్పిటళ్లు, హాస్టళ్లకు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టులు, వైన్, బార్ షాపుల్లో దళితులకు ప్రత్యేక రిజర్వేషన్ తీసుకువస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో దళిత బంధు పథకం దేశానికే దారి చూపుతుందని, దళితుల జీవనగతిని మార్చేసే ఉజ్వల పథకంగా చరిత్రకెక్కుతుందన్నారు. రైతులకు రూ.50 వేల లోపు ఉన్న బ్యాంక్ లోన్లను సోమవారం నుంచి మాఫీ చేస్తామని సీఎం చెప్పారు. ఇప్పటికే రూ. 25 వేల లోపు లోన్లు మాఫీ చేశామన్నారు. ఈ నెలాఖరుకు 9 లక్షల మంది రైతులు రుణ విముక్తులవుతారని తెలిపారు.
95 శాతం ఉద్యోగాలు స్థానికులకే
రాష్ట్రంలో భర్తీ చేయబోయే ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే దక్కుతాయని సీఎం తెలిపారు. ఇందుకోసం కేంద్రంతో నెలల తరబడి చర్చించి కొత్త జోనల్ వ్యవస్థ తీసుకువచ్చామన్నారు. ఇందుకు తగ్గట్టు కొత్త జిల్లాల వారీగా పోస్టులు, ఉద్యోగుల విభజన ప్రక్రియ చేపట్టామన్నారు. ఇది పూర్తవగానే ఉద్యోగాల భర్తీ చేపడుతామన్నారు. చేపలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని, గొర్రెల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉన్నామని తెలిపారు. టీఎస్ ఐపాస్ విధానంతో పరిశ్రమల స్థాపనకు యావత్ ప్రపంచం తెలంగాణ వైపు చూస్తోందని సీఎం చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి రూ.2.2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఏడేండ్లలో 16,671 కొత్త పరిశ్రమలు తరలివచ్చాయన్నారు. వాటి ద్వారా 15.86 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అడుగడుగునా ఫ్లై ఓవర్లు, స్కై వాక్‌లు నిర్మిస్తున్నామని చెప్పారు. నగరం విస్తరిస్తుండటంతో ఓఆర్‌ఆర్ అవతల రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించాలని నిర్ణయించామన్నారు.
సంక్షేమ పథకం చేరని ఇల్లు లేదు
రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకం చేరని ఇల్లు లేదని సీఎం కేసీఆర్ అన్నారు. పింఛన్‌ను రూ. 2,016కు పెంచి చేయూతనిస్తున్నామని, వృద్ధాప్య పింఛన్ అర్హత వయసు 57 ఏండ్లకు తగ్గించి అండగా నిలుస్తున్నామన్నారు. చేనేత కార్మికుల కోసం రైతుబీమా తరహాలోనే చేనేత బీమా అమలు చేయబోతున్నామని చెప్పారు. చేనేత రంగాన్ని ఆదుకోవడానికి ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు. పేదల సొంతింటి కల తీర్చేందుకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని, చివరి లబ్ధిదారుడికి అందే వరకు ఈ పథకం కొనసాగుతుందని చెప్పారు. రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభించడం గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. యాదాద్రి థర్మల్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందన్నారు. రాష్ట్ర జీఎస్‌డీపీలో 20 శాతం ఆదాయం వ్యవసాయం నుంచే సమకూరుతున్నదని తెలిపారు. రాష్ట్రం భవిష్యత్‌లో ఇంకా ఎన్నో అద్భుతాలు సృష్టించి అనేక ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుందని, ఆశించిన గమ్యం చేరుకోవడానికి వాక్ శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధితో పనిచేస్తున్నామన్నారు.
శ్రీశ్రీ పాటతో ప్రసంగం ప్రారంభం
దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ సీఎం కేసీఆర్ ప్రసంగం ప్రారంభించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి నివాళులర్పిస్తున్నానని తెలిపారు. ఈ 75 ఏండ్లలో సాధించిందేమిటి? సాధించాల్సింది ఏమిటో? మదింపు చేసుకోవాలన్నారు. దేశం అనేక రంగాల్లో కొంతమేరకు పురోగమిస్తున్నా, చాలా రాష్ట్రాల్లో ప్రజలు కనీస అవసరాల కోసం కొట్టుమిట్టాడుతున్న దుస్థితి ఉందన్నారు. ‘‘స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి, సంబరపడగానే సరిపోదోయి, సాధించిన దానికి సంతృప్తిని చెంది, అదే విజయమనుకుంటే పొరపాటోయి” అన్న మహాకవి శ్రీ శ్రీ పాటను ఇప్పటికీ మనం అన్వయించుకోవాల్సిన అవసరం ఉందని సీఎం
చెప్పారు.
కరోనా కన్నా.. భయంతోనే ఎక్కువ మంది చనిపోయిండ్రు
కరోనా ఎన్ని కష్టనష్టాలు కల్పిస్తున్నా, వాటిని అధిగమిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని రక్షిస్తున్నామని, ప్రాణాలు కాపాడేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నామని సీఎం తెలిపారు. వ్యాధి కన్నా కరోనా భయంతోనే చాలా మంది చనిపోతున్నారని తెలిసి తానే స్వయంగా హైదరాబాద్, వరంగల్ హాస్పిటళ్లను సందర్శించి అక్కడి రోగులతో మాట్లాడి వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశానన్నారు. ప్రభుత్వపరంగా వైద్య సేవలను మరింత ఎక్కువగా అందుబాటులోకి తెచ్చామని ఆయన తెలిపారు. డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో 50కి పైగా టెస్టులు ఉచితంగా చేస్తామన్నారు. బస్తీ దవాఖానాల తరహాలోనే పల్లె దవాఖానలు ఏర్పాటు చేస్తున్నామని, హెల్త్ సబ్ సెంటర్లలో డాక్టర్లను అందుబాటులోకి తెస్తామని, ఇందుకోసం పెద్ద ఎత్తున డాక్టర్లను రిక్రూట్ చేస్తామని తెలిపారు. ప్రజల హెల్త్ ప్రొఫైల్ రూపొందించే పనిలో నిమగ్నమయ్యామని చెప్పారు. రాష్ట్రంలో కరోనా అదుపులో ఉందని, మూడో వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తుండటంతో దానిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.