
ఏపీలో కొత్త మద్యం పాలసీకి అంతా రెడీ
మొదటి విడతలో 20 శాతం మద్యం షాపుల తగ్గింపు
11 గంటలకు ఓపెన్.. రాత్రి 8 గంటలకే బంద్
MRPకి అమ్మకపోతే షాప్ లైసెన్స్ రద్దు
మద్యపాన నిషేధంలో మహిళల భాగస్వామ్యం పెంచేందుకు ప్రణాళిక
గ్రామాల్లో దాదాపు 15వేల మహిళా కానిస్టేబుళ్లకు అలాట్ మెంట్ ఆర్డర్స్
నవరత్నాల్లో భాగంగా మద్యపాన నిషేదాన్ని మూడు దశల్లో అమలుచేసేందుకు ఏపీ ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. స్టార్ హోటళ్లకు మాత్రమే మద్యం పరిమితం చేయాలని డిసైడైంది. అక్టోబర్ 1 నుండి కొత్త మద్యపాలసీ అమలులోకి తెచ్చేందుకు ఏపీలో అధికారులు అంతా సిద్ధం చేశారు.
ఏపీలో ఇప్పుడున్న 4,380 షాపుల్లో 20శాతం తగ్గనున్నాయి. 3,500 ప్రభుత్వ మద్యం షాపులను, బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ నడుపుతుంది. అక్టోబర్ 1 నుండి వైన్ షాపుల టైమింగ్స్ కూడా మారుతాయి. ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఇప్పు ఓపెన్ చేసి ఉంటున్నాయి. అక్టోబర్ ఫస్ట్ నుంచి… వైన్ షాపులు మార్నింగ్ 11 గంటలకు మొదలవుతాయి. రాత్రి 8 గంటలకే వాటిని బంద్ చేయాల్సి ఉంటుంది. కొత్త పాలసీలో… వైన్ షాపులు.. పర్మిట్ రూమ్స్ పెట్టుకోకూడదు.
MRP రేట్లకు కాకుండా.. ధరలు పెంచి అమ్మితే అలాంటి షాప్ లకు లైసెన్స్ రద్దు చేస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. గ్రామ,వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు… ప్రత్యేకంగా 14,944 మంది మహిళా కానిస్టేబుళ్ల పోస్టులను జగన్ ప్రభుత్వం భర్తీచేసింది. వైన్ షాపులు, బార్లపై మహిళలు చేసే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ.. ఉన్నత స్ధాయి అధికారులకు ఆదేశాలు కూడా వెళ్లాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే మహిళా కానిస్టేబుళ్లే దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టబోతున్నారు. సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో.. 15శాతం మద్యం అమ్మకాలు తగ్గినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.