మారిన మోటార్ వెహికిల్ రూల్స్.. బండి ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే..

మారిన మోటార్ వెహికిల్ రూల్స్.. బండి ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే..

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మోటారు వాహనాల నిబంధనలు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త రూల్స్‌‌పై రోడ్ ట్రాన్స్‌‌పోర్ట్, హైవేస్ స్పష్టతను ఇచ్చింది. అక్టోబర్ 1 నుంచి అమలు కానున్న మోటారు వాహన చట్టం-2019 కొత్త రూల్స్ ఇవే:

1. వెహికిల్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్‌‌స్యూరెన్స్ డాక్యుమెంట్స్ మొదలైనవి ప్రభుత్వ పోర్టల్‌‌లో ఉంటే వాటిని వాహనదారులు తమతో తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.
2. డిజి-లాకర్ లేదా ఎమ్-పరివాహన్ యాప్‌‌ల్లో వాహనదారులు తమ లెసెన్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లాంటి వాటిని అప్‌‌లోడ్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్‌‌‌‌లో ఈ యాప్స్‌‌ను అందుబాటులో ఉంటాయి. యాప్‌‌‌లో మొబైల్ నంబర్‌‌తో రిజిస్టర్ చేసుకోవాలి.
3. లైసెన్స్ ఉపసంహరణ కూడా డిజిటల్‌‌గానే జరుగుతుంది.
4. లైసెన్స్ డిస్‌‌క్వాలిఫికేషన్ లాంటివి డిజిటల్‌‌గా స్టోర్ అవుతాయి.
5. ఈ-చలాన్స్‌‌ను ప్రభుత్వ పోర్టల్ ద్వారా జారీ చేస్తారు.
6. వాహనదారులు డ్రైవింగ్ సమయంలో కేవలం రూట్ నేవిగేషన్ కోసమే మొబైల్ ఫోన్లను వినియోగించాలి.