కొత్తగా పాస్​బుక్​ పొందినోళ్లు రైతు బంధుకు అప్లయ్​ చేసుకోవచ్చు

కొత్తగా పాస్​బుక్​ పొందినోళ్లు రైతు బంధుకు అప్లయ్​ చేసుకోవచ్చు

హైదరాబాద్‌‌, వెలుగు: రైతు బంధు పథకానికి అప్లయ్​ చేసుకునేందుకు కొత్తగా పట్టా పాస్‌‌బుక్‌‌  పొందిన రైతులకు వ్యవసాయ శాఖ అవకాశం ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం రైతు బంధు వెబ్​సైట్‌‌లో ఎడిట్‌‌ ఆప్షన్ ఇచ్చింది. అయితే ఎప్పటివరకు అప్లయ్​ చేసుకోవచ్చనేది చెప్పలేదు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పట్టా పాస్‌‌బుక్‌‌లు వచ్చిన రైతులు దాదాపు 2 లక్షల మంది ఉంటారని అంచనా. ఇప్పటికే స్కీం కింద పెట్టుబడి సాయం పొందుతున్న రైతులు అప్లయ్​ చేసుకోవాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.