మెహిదీపట్నంలో రోడ్డు వేసిన 15 రోజులకే తవ్వారు .. అసహనం వ్యక్తం చేసిన ప్రజలు

మెహిదీపట్నంలో రోడ్డు వేసిన 15 రోజులకే తవ్వారు .. అసహనం వ్యక్తం చేసిన  ప్రజలు

మెహిదీపట్నం, వెలుగు: అధికారుల సమన్వయ లోపంతో కొత్త రోడ్డు ధ్వంసం అవుతోంది. లీకేజీ కారణంగా ఆ రోడ్డును తవ్వాల్సి రావడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గోల్కొండ బోనాల జాతరను పురస్కరించుకుని జూన్​ 25న రూ.9 లక్షలతో లంగర్ హౌజ్ వద్ద సీసీ రోడ్డు వేశారు. 

దీనికి ఒక రోజు ముందే జల మండలి అధికారులు పైప్ లైన్​ మరమ్మత్తులు పనులు చేశారు. ఈ రెండు పనులను హడావిడిగా నిర్వహించారు. ప్రస్తుతం పైప్​లైన్​ లీకేజీ కావడంతో బుధవారం జీహెచ్​ఎంసీ అధికారులు కొత్త రోడ్డును తవ్వి మరమ్మతు పనులు చేశారు. పైపులైన్, సీసీ రోడ్డు వేసిన కొన్ని రోజులకే పైపులైన్​ లీకేజీ రావడానికి కారణం అధికారుల  సమన్వయ లోపమేనని ప్రజలు ఆరోపిస్తున్నారు.