సోషల్ మీడియాలో వైరల్ : ఢిల్లీలో కన్యాదానం కొత్త స్కాం?

సోషల్ మీడియాలో వైరల్ : ఢిల్లీలో కన్యాదానం కొత్త స్కాం?

పూర్వ కాలంలో గ్రామాల్లో ఆడపిల్ల పెళ్లి జరుగుతుందంటే గ్రామంలో అందరూ ఎవరికి తోచిన సాయం వారు చేసేవారు.  కాని ఆధునిక కాలంలో ఎవరి స్థోమతకు తగిన విధంగా వారు పెళ్లిళ్లు చేస్తున్నారు.  కాని తాజాగా దేశరాజధాని ఢిల్లీలో తన కుమార్తె్ను కన్యాదానం చేయాలని సాయం చేయండి అంటూ ఓ వ్యక్తి తిరుగుతున్నాడు.  ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 

ఒక వ్యక్తి రెడ్డిట్ అడిగిన ప్రశ్న ఇప్పుడు చర్చకు దారితీసింది.  దక్షిణ ఢిల్లీలో నివసించే ఓ వ్యక్తి ఇంటికి ఒక మహిళవచ్చి  విరాళం అడిగిందని ఆ వ్యక్తి చెపుతున్నాడు.  తన కుమార్తె వివాహానికి సాయం చేయాలని హిందీలో ఒక అట్టపై రాసుకొని వచ్చి చూపించిదని తెలిపాడు.  అయితే తన దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో పేటీఎం ద్వారా పంపాలని అడిగిందని తెలిపారు.  అప్పుడు తన ఎక్కౌంట్ లో సరిపడినంత డబ్బులు లేవు కాబట్టి.. UPI యాప్ లో కొంత సాంకేతిక సమస్యలో . పాప్ అప్ అని వచ్చిందని చూపించాడు. 

అయితే ఇలాంటి నిజంగా ఉంటాయా.. లేక ఇదొక స్కామా అని రెడ్డిట్ వినియోగదారులను అడిగాడు.  ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సమాధానం ఇచ్చారు.  సాధారణంగా ఇండ్లలో పనిచేసేవారు యజమానులను అడుగుతుంటారని కొందరనగా.. మరికొందరు RWAలో  రోజువారీ  వేతనంపై పనిచేసేవారు  (సఫాయి కారంచారి, స్వీపర్లు, వ్యర్థాలను సేకరించేవారు, ధోబీలు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు) మొదలగు వారు పెళ్లి కార్డు ఇచ్చి అవకాశం ఉంటే సాయం చేయమంటారని  రాసుకొచ్చారు.  కొంతమంది ఇలాగ అడగడంవలన ఇరుగు పొరుగువారితో స్నేహ పూర్వక వాతావరణం ఏర్పడుతుందని పోస్ట్ చేశారు.  నామ మాత్రంగా రూ. 11 లు సహాయం అందించాలని మరొకరు సూచించారు