రైతులకు పంట పెట్టుబడి సాయం ఓకే : అధికారులకు సీఎం ఆదేశం

రైతులకు పంట పెట్టుబడి సాయం ఓకే : అధికారులకు సీఎం ఆదేశం

హైదరాబాద్: రైతులకు పంటపెట్టుబడి సాయం చెల్లింపు చేయాలని అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధుల విడుదలకు సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ హామీ ఇచ్చిన రైతు భరోసా పథకానికి ఇంకా విధివిధానాలు ఖరారు కాలేదు.. దీంతో గతంలో మాదిరిగానే రైతులకు పంట పెట్టుబడి సాయం చెల్లింపులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 

తాము అధికారంలోకి వస్తే రైతులకు పంట సాయం కింద రైతుభరోసా  పథకం ద్వారా రూ.15వేలు ఇస్తామని ప్రకటించింది. వీటితో పాటు కౌలు రైతులకు రూ. 15వేలు, రైతు కూలీలకు రూ.12 ఇస్తామని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్  పార్టీ  ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే రైతు భరోసాపై ఇంకా విధి విధానాలు ప్రకటించకపోవడంతో.. గతంలో ఇచ్చినట్లుగానే రైతులకు రూ. పంట పెట్టుబడి సాయం చేయాలని సోమవారం (డిసెంబర్11) నిర్ణయించింది.ఈ మేరకు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారి చేశారు.   

రూ. 2 లక్షల రుణ మాఫీపై కార్యాచరణ రూపొందించాలి

 తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రం లోని రైతులకు రెండు లక్షల మేరకు రుణ మాఫీ చేసేందుకై తగు కార్యాచరణ ప్రణాలికను రూపొందించాలని ఉన్నతాధికారులను సి.ఎం. ఆదేశించారు.