జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నా యి. ప్రజా ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పథకాలే తమని గెలిపిస్తాయని అధికార కాంగ్రెస్ భావిస్తుండగా...సీట్ల సంఖ్య పెంచుకోవాలని బీజేపీ యోచిస్తోంది. ఇక ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి.. సిట్టింగ్ స్థానాన్ని పదిలంగా కాపాడుకోవడంతోపాటు.. రాష్ట్రంలో తిరిగి పుంజుకోవాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఇక గులాబీ బాస్ కేసీఆర్ ప్రస్తుతం నియోజకవర్గంలో నెలకొన్న పరిణా మాలు, చేరికలు,ప్రచార శైలిపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.
మరోవైపు ప్రధాన పార్టీల అభ్యర్థులకు గుర్తులు గుబులు పుట్టి స్తున్నాయి. తమ పార్టీ గుర్తును పోలిన గుర్తులు పలు పార్టీలు, స్వతంత్ర అభ్య ర్థులకు కేటాయించడంతో ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో మాత్రం తెగ టెన్షన్ పడుతోంది. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ గులాబీ దళంలో ఇదే భయం కనిపిస్తోం ది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న రిజిస్టర్ పార్టీల, స్వతంత్ర అభ్యర్ధులకు ఎన్నికల కమిషన్ గుర్తులు కేటాయించింది. రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థు లకు చపాతీ మేకర్, రోడ్ రోలర్ సింబల్స్ కేటాయించారు. అంబేద్కర్ నేషనల్ పార్టీ అభ్యర్థి చేపూరి రాజుకి రోడ్ రోలర్, అల యన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీకి చెందిన అంబోజు బుద్ధయ్యకి చపాతీ మేకర్ గుర్తును కేటాయించారు.
గతంలో ఈ సింబల్స్ తొలగించాలని ఎన్నికల కమిషన్కు బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. కారు గుర్తుకు దగ్గరగా ఉండటంతో సింబల్స్ గుర్తింపులో ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతున్నా రని ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్ని కల సంఘానికి ఇదే విషయంపై ఫిర్యాదు.కూడా చేశారు.. ఇక ఈ ఉప ఎన్నికల్లో బ్యాలెట్ యూనిట్ లో అభ్యర్థుల కలర్ ఫొటోలు ప్రింట్ చేయనుంది ఈసీ.. ఇది బీఆర్ఎస్కు పెద్ద దెబ్బగా భావిస్తున్నా రు. కాగా, బ్యాలెట్ పేపర్ లో మొదటిస్థానం బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి (కమలం), రెండో స్థానం కాంగ్రెస్ క్యాం డిడేట్ నవీన్ యాదవ్ (హస్తం, మూడో స్థానం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీ తగోపీనాథ్ (కారు)కు కేటాయించారు. ఇక 5వ నంబర్ లో తెలుగు రాజ్యాధికార సమితీ పార్టీ అభ్యర్థికి సోప్ డిష్, 9వ నంబర్లో అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీకి చెందిన అంబోజు బుద్ద య్యకి చపాతీ మేకర్, 13న నంబర్లో అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి చేపూరి రోడ్డు రోలర్ అలాట్ చేశారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో అభ్యర్థుల తుది జాబితా ఇప్పటికే ఖరారైంది. నవంబర్ 11న పోలింగ్ జరిగే ఎలక్షన్లో 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లుగా ఈసీ ప్రకటించింది. మొత్తం 211 మంది నామినేషన్లు వేయగా 81 మంది అభ్యర్థులు అర్హత పొందారు. వారిలో మొత్తం 23 మంది నామినేషన్లను విశ్రా చేసుకోగా.. 58 మంది బరిలో నిలిచారు. అయితే, ఇంత మంది పోటీ చేయడం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక 2009 ఎన్నికల్లో 13 మంది, 2014 ఎన్నికల్లో 21 మంది, 2018 ఎన్నికల్లో 18 మంది పోటీపడగా.. 2023లో జరిగిన ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వారిలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. అయితే, ఆయన మరణంతో ఉప ఎన్నిక రావడంతో ఈ సారి పోటీలో ప్రధాన పార్టీలతోపాటు పెద్ద సంఖ్యలో స్వతంత్రులు, విద్యార్థి సంఘాల నాయకులు, రైతులు బరిలోకి దిగారు.
