ట్రాఫిక్ చలాన్లతో జేబులకు చిల్లు

ట్రాఫిక్ చలాన్లతో జేబులకు చిల్లు

గ్రేటర్ హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ చలాన్లు పబ్లిక్ ను పరేషాన్ చేస్తున్నాయి. ఓ వైపు ట్రాఫిక్ జాంలతో ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు వేస్తున్న చలాన్లు తలనొప్పిగా మారాయి. రోడ్లు బాగు చేసి... ట్రాఫిక్ జాంలు లేకుండా చర్యలు తీసుకున్న తర్వాతే చలాన్లు వేయాలని పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు.

చలాన్లతో జేబులకు చిల్లు

సిటీ రోడ్లపై జర్నీ అంటేనే పబ్లిక్ వణికిపోతున్నారు. ఇరుకైన రోడ్లు, ఆపై గుంతలు, ఇంక ప్రధాన ఏరియాల్లో పార్కింగ్ ఫెసిలిటీస్ లేక వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యలు ఇలా ఉంటే... ట్రాఫిక్ పోలీసులు వేస్తున్న చలాన్లు తమ జేబులకు చిల్లు పడుతుందని జనం వర్రీ అవుతున్నారు. ఆన్ లైన్ చలాన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత చలాన్లు భారీగా పెరిగాయి. రూల్స్ బ్రేక్ చేసిన వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు చలాన్ల మోత మోగిస్తున్నారు. సిగ్నల్ జంప్, ర్యాష్ డ్రైవింగ్, వితౌట్ హెల్మెట్, రాంగ్ రూట్ వంటి వాటికి వంద నుంచి వెయ్యి రూపాయల వరకు ఫైన్లు వేస్తున్నారు. అంతేకాదు సిగ్నల్ దగ్గర పహారా కాస్తున్న ట్రాఫిక్ సిబ్బంది.. ఒకటి రెండు చలాన్లు ఉన్నవారిని కూడా వదలడం లేదు. ఫైన్లు కట్టే వరకు బండి కదలనివ్వడం లేదని వాహనదారులు వాపోతున్నారు.

ఆన్ లైన్ చలాన్లపై జనం ఆగ్రహం

ఆన్ లైన్ చలాన్లపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని జంక్షన్లలో పోలీసులు కెమెరాలను మిస్ యూజ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. బిజినెస్ రోడ్లపై వెహికిల్స్ ఎలా పార్కింగ్ చేసినా చూసి చూడనట్టు వదిలేస్తున్న పోలీసులు.. బిజీగా ఉన్న రోడ్లపై ఒక్క నిమిషం బైక్ ఆపినా చలాన్లతో బాదేస్తున్నారని వాహనదారులు మండిపడుతున్నారు. ట్రాఫిక్ వింగ్ లో SI స్ధాయి నుంచి డీసీపీ వరకు చలాన్ల టార్గెట్ ఉందంటున్నారు. ఆ టార్గెట్ రీచ్ అయ్యే వరకు దొరికినోళ్లకు దొరికినంత అన్నట్టుగా చలాన్లు వేస్తున్నారని పబ్లిక్ విమర్శిస్తున్నారు.

ఇష్టానుసారంగా చలాన్లు

సిటిలో తిరిగే ఆటోల విషయంలోనూ అంతే. ప్యాసింజర్స్ కోసం ఆటో అపినా చలాన్లు వేస్తున్నారని ఆటోవాలాలు అంటున్నారు. దీంతో రోజంతా కష్టపడినదంతా ఫైన్లు కట్టడానికే సరిపోతుదంటున్నారు. ఇష్టానుసారంగా చలాన్లు వేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. SI, CI లెవల్ అధికారులు ఉన్నప్పుడు చలాన్లు వేయాలనే ఆదేశాలున్నా.. కానిస్టేబుల్ స్ధాయిలో కూడా బండ్లను ఆపి చలాన్లు వేస్తున్నారని  పబ్లిక్ అంటున్నారు. చలాన్లు, కేసులు బుక్ చేయడంలో ఉన్న శ్రధ్ద.. ట్రాఫిక్ ని కంట్రోల్ చేసే విషయంలో లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీక్ టైమ్ లో బండ్లను ఆపి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇక పోలీసులు మాత్రం రూల్స్ బ్రేక్ చేస్తేనే చలాన్లు వేస్తున్నామని అంటున్నారు. పబ్లిక్ లో అవెర్ నెస్ తెచ్చేందుకు స్పెషల్ డ్రైవులు నిర్వహిస్తున్నారు. టార్గెట్ బేస్డ్ పనిచేస్తున్నామన్న ఆరోపణల్లో నిజం లేదంటున్నారు.