
మహీంద్రా ట్రాక్టర్స్ యూవో టెక్ ప్లస్ 475 డీఐ ట్రాక్టర్‌ను విడుదల చేసింది. 42 హెచ్‌పీ సామర్థ్యం గల ఈ ట్రాక్టర్‌ను వ్యవసాయ, వ్యవసాయేతర పనుల కోసం రూపొందించారు. ఈ ట్రాక్టర్ ఎక్కువ ఉత్పాదకత, మెరుగైన ఇంధన సామర్థ్యం, సౌకర్యాన్ని అందిస్తుంది. ఇందులో 2,980 సీసీ ఎంబీయుఎల్ఎల్ 3-సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 191 ఎన్ఎమ్ గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రైతులు తమ పనులకు అనుగుణంగా పీటీఓ వేగాన్ని మార్చుకోవచ్చు. డ్యూయల్ క్లచ్, 12 ఫార్వర్డ్, 3 రివర్స్ గేర్ల వల్ల ఈ ట్రాక్టర్ కఠినమైన పరిస్థితుల్లో కూడా వేగాన్ని నిలబెట్టుకుంటుందని కంపెనీ తెలిపింది.