ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయం..కార్మికుల కోసం వెల్ఫేర్ కౌన్సిల్

ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయం..కార్మికుల కోసం వెల్ఫేర్ కౌన్సిల్

ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరాలని ఉత్తర్వులు జారీ చేసిన సీఎం కేసీఆర్ ..డిపో నుంచి ఇద్దరి చొప్పున వర్కర్స్ వెల్ఫేర్ కౌన్సిల్  పెడతామన్నారు. యూనియన్లతో సంబంధం లేకుండా పనిచేస్తుందన్నారు. ఈ ఫెడరేషన్ మంత్రితో డైరెక్ట్ గా టచ్ లో ఉంటుందని చెప్పారు. యూనియన్ల కోసం కార్మికుల జీవితాలు ఫణంగా పెట్టారని..సింగరేణి తరహాలో ఆర్టీసీని చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆర్టీసీని గొప్ప ఆర్టీసీ దిశగా రానున్న రోజుల్లో నిర్ణయాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఆర్టీసీ సమస్య ఇంతటితో ముగిసిందని అనుకుంటున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేసిన కేసీఆర్..ఎలాంటి షరతులు లేకుండా కార్మికులు ఉద్యోగాల్లో చేరేందుకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందన్నారు. ప్రైవేటీకరణ లేదు…అవకాశం ఉన్నా చేయడం లేదని సీఎం కేసీఆర్ ప్రకటించారు.