ఫ్రాన్స్‌‌లో న్యూ ఇయర్‌‌‌‌ వేడుకలు బంద్

ఫ్రాన్స్‌‌లో న్యూ ఇయర్‌‌‌‌ వేడుకలు బంద్

పారిస్‌‌: ఫ్రాన్స్‌‌లో న్యూ ఇయర్‌‌‌‌ వేడుకలను బ్యాన్‌‌ చేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. కరోనా వైరస్‌‌ వ్యాపిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సెలవు రోజుల్లో వైరస్‌‌ వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందని, న్యూ ఇయర్​ వేడుకల్లో పబ్లిక్‌‌ కన్‌‌సర్ట్‌‌లతో పాటు పటాకులు కాల్చడాన్ని నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఫ్యామిలీ మెంబర్స్‌‌తో క్రిస్మస్‌‌, న్యూ ఇయర్‌‌‌‌ వేడుకలు జరుపుకోవచ్చని ప్రధాన మంత్రి జీన్‌‌ కాస్టెక్స్‌‌ చెప్పారు. దేశంలో ప్రస్తుతం ఫిఫ్త్‌‌ వేవ్‌‌ ఉందని, ఇది చాలా వేగంగా విస్తరిస్తోందని ఆయన హెచ్చరించారు. జనవరి ప్రారంభంలో ఒమిక్రాన్‌‌ వేరియంట్‌‌తో దేశంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందన్నారు. వీలైనంత త్వరగా ప్రజలందరూ కరోనా వ్యాక్సిన్‌‌ వేసుకోవాలని కోరారు. ఒమిక్రాన్‌‌ వేరియంట్‌‌ భయంతో యూరోపియన్‌‌ యూనియన్‌‌, బ్రిటన్‌‌ ప్రయాణాలపై ఆంక్షలు విధించినట్లు తెలిపారు.