T20 World Cup: టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్లు తలపడబోతున్నాయి. ఈ హైవోల్టెజ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. దీంతో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. టాస్ తర్వాత కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ.. టాస్ గెలిచిన తర్వాత ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించాం.. ఈ పిచ్ బాగానే కనిపిస్తోంది.. మొదట ఎలా ప్రవర్తిస్తుందో చూద్దాం.. భారత్‌ను తక్కువ స్కోర్‌కు పరిమితం చేసి, తర్వాత చేజ్ చేస్తాం.. మా ఆటగాళ్లు మంచి ఫామ్‌లో ఉన్నారు.. ఇలాంటి పెద్ద మ్యాచ్‌లలో మేము కష్టపడుతున్నాం.. సెమీఫైనల్లో గెలుపు మాకు మంచి ఆత్మవిశ్వాసం ఇచ్చింది.. ఇది పెద్ద వేదిక, అందరూ సిద్ధంగా ఉన్నారు.. మా టీమ్ లో ఒక మార్పు ఉంది.. మెకాన్చీ ఆడటం లేదు, అతని స్థానంలో డఫీ తుది జట్టులోకి వచ్చాడని శాంట్నర్ తెలిపాడు.
భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ముందుగా బ్యాటింగ్ చేయడంపై సంతోషంగా ఉన్నాం.. ఇటీవల మేము ముందుగా బ్యాటింగ్ చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నాం.. ముఖ్యంగా సెమీఫైనల్ లేదా ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌ల్లో స్కోర్ బోర్డుపై భారీగా పరుగులు పెట్టడం ఎప్పుడూ మంచిదే.. గతంలో జరిగింది మర్చిపోయాం.. ఇది కొత్త వరల్డ్ కప్, మేమంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నాం.. స్టేడియం ఇప్పటికే అభిమానులతో నిండిపోయింది.. టాస్ సమయానికే ఈ స్థాయిలో జనాలు రావడం గొప్ప విషయం.. అభిమానులకు మంచి ఆట చూపిస్తామని ఆశిస్తున్నాం.. మా జట్టులో ఎలాంటి మార్పులు లేవని సూర్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్( వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా
న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ
