4వ టీ20లో మ్యాచ్ టై: కివీస్ కు చుక్కలు చూపించిన భారత్

4వ టీ20లో మ్యాచ్ టై: కివీస్ కు చుక్కలు చూపించిన భారత్

వెల్లింగ్టన్: ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా శుక్రవారం భారత్-న్యూజిలాండ్ తో జరిగిన 4వ టీ20 మ్యాచ్ టై అయ్యింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 165 రన్స్ చేసింది. టీమిండియాలో మనీష్ పాండే(50 హాఫ్ సెంచరీ), రాహుల్(39) మాత్రమే రాణించగా మిగతా ప్లేయర్లు ఎక్కువ స్కోరు చేయలేకపోయారు.

తక్కువ టార్గెట్ తో బరిలోకి దిగిన కివీస్.. అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంది. ప్రారంభం నుంచే ఆచితూచి ఆడుతూ టార్గెట్ ను ఫినిష్ చేసేలా కనిపించింది. అయితే చివరి ఓవర్ లో విజయానికి 7 రన్స్ అవసరంకాగా..  4  వికెట్లు తీసి కివీస్ కు షాక్ ఇచ్చింది భారత్. దీంతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 165 రన్స్ చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

కివీస్ ప్లేయర్లలో మున్రో (64), సీఫెర్ట్(57) రన్స్ తో రాణించారు.

భారత్ బౌలర్లలో.. బుమ్రా, చాహాల్ చెరో వికెట్ తీయగా ఠాకూర్ 2 వికెట్లు తీశాడు.

నేను సైగ చేసి ఉంటే-  బాలకృష్ణ 

మోడీ మా ప్రధాని:  కేజ్రీవాల్