V6 News

న్యూజిలాండ్ వేదికగా ICC ఉమెన్స్ వరల్డ్ కప్ 2022

న్యూజిలాండ్ వేదికగా ICC ఉమెన్స్ వరల్డ్ కప్ 2022

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ టోర్నీలో మొత్తం 8జట్లు పోటీపడనున్నాయి. 2022 మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 3 వరకూ 31రోజుల పాటు మ్యాచ్‌లు జరగనున్నాయి. న్యూజిలాండ్‌లోని 6 గ్రౌండ్లలో ఈ టోర్నీ నిర్వహించనున్నట్లు ICC తెలిపింది. టీమిండియా తమ మొదటి మ్యాచ్‌ను మార్చి 6న ఆడనుంది. ఏప్రిల్‌ 3న ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుందని ఐసీసీ చెప్పింది. ఆక్లాండ్‌, హామిల్టన్‌, తారంగ, వెల్లింగ్టన్‌, క్రైస్ట్‌చర్చ్‌, డునెదిన్‌ మైదానాలు ఈ  మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.