వ్యాక్సిన్ వికటించి మహిళ మృతి

వ్యాక్సిన్ వికటించి మహిళ మృతి

కరోనా వైరస్ ను అరికట్టేందుకు వరల్డ్ వైడ్ గా రకరకాల కంపెనీలకు చెందిన వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయినా ఇంకా కొన్ని సంస్థలు వ్యాక్సిన్లను రూపొందిస్తూనే ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే వ్యాక్సిన్ వికటించి పలుచోట్ల పలువురు ప్రాణాలు కోల్పోయారు. లేటెస్టుగా ఫైజర్ వ్యాక్సిన్ వికటించి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన న్యూజిలాండ్ లో జరిగింది. ఈ విషయాన్ని న్యూజిలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆమె అత్యంత అరుదైన మయోకార్డిటిస్ తో చనిపోయినట్టు భావిస్తున్నట్టు న్యూజిలాండ్ ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ వ్యాక్సిన్ తో తమ దేశంలో మొదటి మృతి ఇదేనని చెప్పింది. అయితే..ఆ మృతురాలు ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలిపింది. అయితే ఫైజర్ వ్యాక్సిన్ తో అనర్థాల కంటే ఉపయోగాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పింది.