బ్రెజిల్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ జట్టులో నేమార్‌‌‌‌.. అనుభవానికి ప్రాధాన్యత ఇచ్చిన సెలక్టర్లు

బ్రెజిల్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ జట్టులో నేమార్‌‌‌‌.. అనుభవానికి ప్రాధాన్యత ఇచ్చిన సెలక్టర్లు

రియో డి జనీరో: ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌పై చాలా అనుమానాలు ఉన్నప్పటికీ.. బ్రెజిల్‌‌‌‌ ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌ స్టార్‌‌‌‌ నేమార్‌‌‌‌ జూనియర్‌‌‌‌కు వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ జట్టులో చోటు దక్కింది. ఫామ్‌‌‌‌లేమి, గాయాలతో ఇబ్బందిపడుతున్న నేమార్‌‌‌‌ ఎంపికపై కొన్ని రోజుల క్రితం వరకు మాజీ ప్లేయర్లు, విశ్లేషకులు పెదవి విరిచారు. 

కానీ సెలెక్టర్లు మాత్రం అతని అనుభవానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. దాంతో 34 ఏళ్ల నేమార్‌‌‌‌ నాలుగోసారి మెగా టోర్నీలో బరిలోకి దిగబోతున్నాడు. 79 గోల్స్‌‌‌‌తో బ్రెజిల్‌‌‌‌ ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌ చరిత్రలో అత్యధిక గోల్స్‌‌‌‌ చేసిన ప్లేయర్‌‌‌‌గా రికార్డు సృష్టించిన నేమార్‌‌‌‌.. అక్టోబర్‌‌‌‌ 2023లో మోకాలి గాయానికి గురయ్యాడు. అప్పట్నించి పూర్తి ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ సాధించడానికి చాలా ఇబ్బందిపడ్డాడు. ఈ ఏడాది శాంటోస్‌‌‌‌ క్లబ్‌‌‌‌ తరఫున కేవలం 8 మ్యాచ్‌‌‌‌లు ఆడిన నేమార్‌‌‌‌ 4 గోల్స్‌‌‌‌ కొట్టాడు.