- నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
న్యూఢిల్లీ, వెలుగు: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ ప్రమాదంలో 8 మంది కార్మికులు గల్లంతుపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) మరోసారి స్పందించింది. మృతదేహాల వెలికితీతలో కాలయాపన చేయడం ఏంటని ప్రశ్నించింది. దీనిపై తమకు సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ సీఎస్ రామకృష్ణారావును ఆదేశించింది.
ఈ ఘటనలో అశ్రద్ధ వహించిన అధికారులపై చర్యలు తీసుకుని, మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేయాలంటూ మానవ హక్కుల న్యాయవాది ఇమ్మానేని రామారావు ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. దీనిపై శుక్రవారం మరోసారి విచారణ జరిపిన ఎన్‌హెచ్‌ఆర్సీ సీఎస్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై నాలుగు వారాల్లోగా సగమ్ర నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు జారీ ఇచ్చింది.
