- జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్‌పై విచారణకు నిర్ణయం
పద్మారావునగర్, వెలుగు: ఖమ్మంలోని వెలుగుమట్లలో 600 ఇండ్ల కూల్చివేత ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది.సీనియర్ లాయర్ రామారావు ఇమ్మనేని చేసిన ఫిర్యాదు మేరకు ఖమ్మం కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిపై విచారణ చేపడ్తామని చెప్పింది. సర్వే నంబర్లు 147, 148, 149లో ఉన్న భూదాన్ భూములపై గతంలో తెలంగాణ హైకోర్టు స్టేటస్ కో విధించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
భూదాన్ భూముల అసలు ఉద్దేశం పేదలకు భూములు ఇవ్వడమేనని, పేదలు ఇండ్లు కట్టుకున్న భూములపై నిషేధం లేదని అప్పుడు కోర్టు స్పష్టం చేసిందన్నారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ జడ్జి, సీసీఎల్‌ఏ కమిషనర్‌తో కమిటీ ఏర్పాటు చేయాలని కూడా హైకోర్టు ఆదేశించిందని చెప్పారు. అయితే, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇండ్ల కూల్చివేత చేపట్టిన కలెక్టర్, అదనపు కలెక్టర్ పై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ఎన్‌హెచ్‌ఆర్సీని కోరారు.
