యువతి జుట్టు పట్టి లాగిన మహిళా పోలీసులు.. జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం

యువతి జుట్టు పట్టి లాగిన మహిళా పోలీసులు.. జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం

రాజేంద్రనగర్ లోని  అగ్రికల్చర్ వర్శిటీ భూములను హైకోర్టుకు కేటాయించొద్దంటూ ఇవాళ వర్శిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా ఏబీవీపీ నేతలు మద్దతిస్తూ నిరసన చేపట్టారు.  జీవో నెంబర్ 55 ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను, ఏబీవీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి రాజేంద్రనగర్ పీఎస్ కు తరలించారు.   ఈ ఆందోళనలో పాల్గొన్న ఓ ఏబీవీపీ యువతిని బైక్ పై వెంబడించిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు జుట్టు పట్టుకుని లాగారు. దీంతో ఆమె కింద పడిపోయింది.   ఈ వీడియో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

మరో వైపు  ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులను ఇలా ఈడ్చుకెళ్లడం కరెక్ట్ కాదని తెలిపింది. ఈ ఘటనకు కారణమైన పోలీసులు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది .వెంటనే సంబంధింత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.