దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు

ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) సోదాలు జరిపింది. ఐదు రాష్ట్రాల్లో 22 చోట్ల ఎన్ఐఏ సోదాలు జరిగాయి. పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-ఈ-మహ్మద్ భారత్లో పలుచోట్ల ఉగ్ర దాడులకు కుట్ర పన్నుతోందనే సమాచారంతో ఎన్ఐఏ ఈ సోదాలు చేసింది. జమ్ము కశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, అస్సోం, ఢిల్లీ రాష్ట్రాల్లో ఈ సోదాలు జరిగాయి. మాలేగావ్లోని ఒక హోమియోపతి క్లినిక్లో ఎన్ఐఏ సోదాలు జరిపింది.

 

అక్టోబర్ 2న రాజస్థాన్లోని 8 రైల్వే స్టేషన్లలో బాంబులు పెట్టామని జైష్ ఈ మహ్మద్ గ్రూప్ లేఖ రాసిందనే వార్తలు కలకలం రేపాయి. జైష్ ఈ మహ్మద్ అనే పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ 2019లో జరిగిన పుల్వామా దాడుల సందర్భంలో వార్తల్లో నిలిచింది. ఈ దాడులు తమ పనేనని ఈ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. పుల్వామా దాడుల్లో 46 మంది భారత సైనికులను ఈ ఉగ్ర సంస్థ పొట్టనపెట్టుకుంది.

ALSO READ | Haryana Polls 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు.. మొదటిసారి ఓటేసిన మను భాకర్