దేశ వ్యాప్తంగా 17 చోట్ల ఎన్ఐఏ సోదాలు

దేశ వ్యాప్తంగా 17 చోట్ల ఎన్ఐఏ సోదాలు
  •  బెంగళూరు జైల్లో టెర్రర్​ కార్యకలాపాలు
  • ఖైదీలను తీవ్రవాదులుగా మార్చుతున్నారని కేసు 

హైదరాబాద్‌, వెలుగు: బెంగళూరు జైలు నుంచి తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) దర్యాప్తు ముమ్మరం చేసింది. కర్నాటక, తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల్లోని 17 ప్రాంతాల్లో  మంగళవారం సెర్చ్‌ ఆపరేషన్స్‌ చేపట్టింది. బెంగళూరు అగ్రహార సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న లష్కర్‌- ఈ- తాయిబా(ఎల్‌ఈటీ) టెర్రరిస్టులు తోటి ఖైదీలను టెర్రరిజం వైపు మార్చుతున్నట్లు గతేడాది అక్టోబర్‌ 25న ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. 

ఈ ఏడాది జనవరి12న అధికారులు చార్జిషీట్‌ నమోదు చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితులు జునైద్‌ అహ్మద్‌, సల్మాన్‌ఖాన్‌లు దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకున్నట్టు గుర్తించింది. ఈ మేరకు మంగళవారం ఏడు రాష్ట్రాల్లో తనిఖీలు చేపట్టింది.ఈ సోదాల్లో డిజిటల్‌ పరికరాలు,పలు దేశాల కరెన్సీ, 
అనునాస్పదన పత్రాలు స్వాధీనం చేసుకుంది.