
సౌత్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhhi Agerwal) అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తోంది. తన గ్లామర్ డాల్ ఇమేజ్ ను చెరిపేసుకునేందుకు ఇస్మార్ట్ భామ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు'లో నిధి నటిస్తోంది. ఈ పీరియాడికల్ డ్రామాలో ఈ బ్యూటీకి యాక్టింగ్కి స్కోప్ ఉన్నరోల్ దక్కినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే లేటెస్ట్గా ఈ అమ్మడు ఫస్ట్ టైం బాలీవుడ్ నుంచి ‘అకిడో’వెబ్ సీరిస్తో OTT లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలిపింది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా అకిడో మూవీ విశేషాలు షేర్ చేసుకోంది.
ఎ రివెంజ్ డ్రామా జోనర్లో తెరక్కుతున్న అకిడో మూవీని అభిషేక్ జైస్వాల్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇటువంటి థ్రిల్లింగ్ మూవీస్ను రూపొందించడంలో బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న ప్రొడ్యూసర్ ప్రేరణా అరోరాతో వర్క్ చేయడం చాలా హ్యాపీ. అలాగే ఈ సినిమా కోసం డేట్స్ కూడా అలోచించి సెట్ చేసుకుంటున్నాను.
ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్‌లోని ఇద్దరు పెద్ద స్టార్స్ పవన్ కళ్యాణ్, ప్రభాస్ తో సినిమాలతో పాటుగా..కోలీవుడ్ మూవీస్ కూడా కమిట్ అయ్యాను. కాగా ‘అకిడో’ షూటింగ్ ఈ డిసెంబర్ ఎండ్ లో స్టార్ట్ కానుందని’ చెప్పుకొచ్చింది బ్యూటీ.