గ్రేటర్ నోయిడా: తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్.. నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్‌తో మెరిసింది. శనివారం జరిగిన విమెన్స్ 51 కేజీ ఫైనల్లో నిఖత్ 5–0తో నీతూ గంగాస్‌పై గెలిచి మూడోసారి చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుంది. ఆరంభం నుంచే పదునైన అప్పర్ కట్స్, హుక్స్‌తో చెలరేగిన తెలంగాణ బాక్సర్.. ప్రత్యర్థికి ఎక్కడా చాన్స్ ఇవ్వలేదు.
75 కేజీ ఫైనల్లో లవ్లీనా బోర్గోహైన్ 5–0తో సనమాచా చానూను ఓడించింది. మీనాక్షి హుడా (48 కేజీ) కూడా స్వర్ణం సాధించింది. వెన్ను గాయం నుంచి కోలుకున్న మహ్మద్ హుస్సాముద్దీన్ (60 కేజీ) 5–0 సచిన్ సివాచ్‌ను ఓడించి గోల్డ్‌ను సొంతం చేసుకున్నాడు. విశ్వనాథ్ సురేశ్ (50 కేజీ), జాదుమణి సింగ్ (55 కేజీ), ఆదిత్య ప్రతాప్ (65 కేజీ), హితేశ్ గులియా (70 కేజీ)స్వర్ణాలను సాధించారు.
