గోల్డ్‌‌పై నిఖత్ గురి.. నవంబర్ 16 నుంచి వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌‌

గోల్డ్‌‌పై నిఖత్ గురి.. నవంబర్ 16 నుంచి వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌‌

గ్రేటర్ నోయిడా: ఇండియా స్టార్ బాక్సర్‌‌‌‌, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ సీజన్ ఎండింగ్ వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ కు రెడీ అయింది.  ఆదివారం మొదలయ్యే ఈ టోర్నీలో గోల్డ్‌‌తో పాటు విలువైన ర్యాంకింగ్ పాయింట్లపై నిఖత్ సహా ఇండియా బాక్సర్లు దృష్టి సారించారు. . 

వచ్చే ఏడాది ఆసియా గేమ్స్‌‌, కామన్వెల్త్ గేమ్స్‌‌ జరగనున్న నేపథ్యంలో ఈ ర్యాంకింగ్ పాయింట్లు కీలక పాత్ర పోషించనున్నాయి. ఆతిథ్య దేశంగా అన్ని 20 వెయిట్ కేటగిరీల్లో పూర్తి స్థాయి జట్టును ఇండియా బరిలోకి దించుతోంది. డబుల్ వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్ (51కేజీ)కు తొలి రౌండ్‌‌లో బై లభించింది.