గోల్డ్ మెడల్ కు అడుగు దూరంలో..

గోల్డ్ మెడల్ కు అడుగు దూరంలో..

 

  • నేడు థాయ్ బాక్సర్ తో టైటిల్ ఫైల్
  • మనీషా, పర్వీన్ కు బ్రాంజ్ మెడల్స్

తన కలను సాకారం చేసుకునేందుకు ప్రపంచ ఛాంపియన్ షిప్ గా శిఖరాన నిలిచేందుకు తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ మరొక్క పంచ్ దూరంలో నిలిచింది. ఈ ఏడాది ఆరంభం నుంచి సంచలన ఆటతో దూసుకెళ్తున్న నిఖత్ విమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో ఫైనల్ కు చేరుకుంది. నేడు జరిగే టైటిల్ ఫైట్ లో నిఖత్ గోల్డెన్ పంచ్ కొట్టాలని దేశం మొత్తం ఆశిస్తోంది. 

న్యూఢిల్లీ: 11 సంవత్సారాల కిందట జూనియర్ వరల్డ్ ఛాంపియన్ షిప్ గోల్డ్ మెడల్ గెలిచి ఇండియా బాక్సింగ్ లో తన రాకను ఘనంగా చాటుకున్న హైదరాబాదీ నిఖత్ జరీన్ ఇప్పుడు ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో బంగారు పతకం ముంగిట నిలిచింది. తోటి బాక్సర్లంతా సెమీస్ లోనే వెనుదిరిగిన వేళ నిఖత్ (52 కేజీ) మాత్రమే తుదిపోరుకు అర్హత సాధించింది. మనీషా మౌన్ (57 కేజీ), పర్వీన్ (63కేజీ) సెమీస్ లో ఓడి బ్రాంజ్ తో సరిపెట్టారు. బుధవారం జరిగిన తన సెమీఫైనల్ బైట్ లో నిఖత్ 5  - 0 తేడాతో బ్రెజిల్ కు చెందిన కరోలిస్ డి ఆమేదను చిత్తు చేసింది. కానీ, మనీషా 0 - 5 తో అమీ బ్రోదర్ట్ (ఐర్లాండ్) చేతిలో ఓడి బ్రాంజ్ తో తిరిగొచ్చారు. 
గురువారం జరిగే ఫైనల్ లో నిఖత్.. థాయిలాండ్ కు చెందిన జిట్ పాంగ్ జుటమాస్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మెగా ఈవెంట్ లో ఇప్పటిదాకా ఆరుసార్లు ఛాంపియన్ ఎంపీ మేరికోమ్, సరిదాదేవి, జెన్నీ ఆర్ఎల్ లేఖ మాత్రమే గోల్డ్ మెడల్స్ నెగ్గారు. 
అదే జోరు
టోర్నీలో ఇప్పటి దాకా ఆడిన అన్ని బౌట్లలోనూ 5  - 0 తేడాతో గెలిచిన నిఖత్ మరోసారి అదే ఫలితాన్ని రాబట్టింది. వరల్డ్ ఛాంపియన్ షిప్ లో రెండోసారి పోటీపడుతున్న ఈ హైదరాబాదీ తొలి రౌండ్ కాస్త జాగ్రత్తగా ఆరంభించింది. తర్వాత నెమ్మదిగా గేర్లు మారుస్తూ దూకుడు పెంచింది. పవర్ ఫుల్ పంచ్ లు కొట్టింది. టెక్నిక్ పరంగా చాలా ముందున్న 25 ఏళ్ల నిఖత్ వేగాన్ని అందుకోలేకపోయిన బ్రెజిల్ బాక్సర్ బౌట్ ఆసాంతం ఇబ్బందిపడింది. దాంతో రెండు రౌండ్లలోనే హైదరాబాదీ స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. మూడో రౌండ్ లోనే అదే జోరు కొనసాగించిన నిఖత్.. రింగ్ నలువైపులా కదులుతూ ప్రత్యర్థికి తనపై దాడి చేసే అవకాశం ఇవ్వలేదు. అదే టైమ్ లో ఛాన్స్ వచ్చిన ప్రతీసారి పంచ్ లు కొట్టిన జరీన్ ను ఐదుగురు జడ్జీలు ఏకగ్రీవంగా విజేతగా ప్రకటించారు. 

 

 


గోల్డ్ తో తొరిగొస్తా
ఈరోజు నేను స్పష్టమైన ప్రణాళికతో వచ్చా. ప్రత్యర్థి తన నేచురల్ గేమ్ ఆడకుండా అడ్డుకుని నా గేమ్ అడ్జస్ట్ అయ్యేందుకు సమయం తీసుకునేలా చేసి విజయం సాధించా. ఇప్పుడు గోల్డ్ మెడల్ తో తిరిగి రావాలని ఆశిస్తూ.. నా ఫైనల్ ప్రత్యర్థితో ఇది వరకు ఓసారి ఆడాను కాబట్టి ఆమె ఆటపై కొంత అవగాహన ఉంది. సెమీ ఫైనల్లో ఓ రౌండ్ లో ఆమె ఆటను గమనించా. అయినా, మా హెడ్ కోచ్ తో కలిసి ఫైనల్ కోసం ప్లాన్ రెడీ చేస్తా. దేశం కోసం గోల్డ్ మెడల్ సాధిస్తానన్న నమ్మకం ఉంది.  -నిఖత్ జరీన్

 

మరిన్ని వార్తల కోసం

థాయిలాండ్ ఓపెన్ లో భారత్ కు మిశ్రమ ఫలితాలు..

కాంస్య పతకం సాధించిన బాక్సర్ మనీషా మౌన్

థాయిలాండ్ ఓపెన్ రెండో రౌండ్లోకి పీవీ సింధు