లండన్‌‌లో 'నికితా రాయ్' షురూ

లండన్‌‌లో 'నికితా రాయ్' షురూ

ప్రతి హీరోయిన్‌‌ కెరీర్‌‌‌‌లో కొన్ని సినిమాలు ప్రత్యేకంగా నిలిచిపోతాయి. అలాంటి సినిమా తనకిప్పుడు దొరికింది అంటోంది సోనాక్షీ సిన్హా. ఆమె లీడ్‌‌ రోల్‌‌లో నటిస్తున్న ‘నికితా రాయ్ అండ్ బుక్ ఆఫ్ డార్క్‌‌నెస్’ మూవీ షూటింగ్ నిన్న లండన్‌‌లో మొదలయ్యింది. ఈ సందర్భంగా చాలా ఎమోషనల్ అయ్యింది సోనాక్షి. దానికి కారణం.. ఈ చిత్రానికి ఆమె అన్నయ్య ఖుష్ దర్శకుడు కావడం. 

‘ఈరోజు కోసం ఎంతో ఎదురుచూశాను. మా అన్నయ్య దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేస్తున్నాడు. నేను తన డైరెక్షన్‌‌లో నటిస్తున్నాను. ఇదంతా నాకు చాలా ఎక్సైటింగ్‌‌గా అనిపిస్తోంది. ఎంతో ఆనందంగాను, అంతకంటే ఎక్కువ గర్వంగాను కూడా ఉంది’ అంటూ తన సంతోషాన్ని పంచుకుంది సోనాక్షి. ఇదొక క్రైమ్ థ్రిల్లర్. సోనాక్షి టైటిల్‌‌ రోల్‌‌లో కనిపించనుంది. పరేష్ రావల్, సుహైల్ నయ్యర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిక్కీ భగ్నానీ, విక్కీ భగ్నానీ నిర్మిస్తున్నారు. నలభై రోజుల సింగిల్‌‌ షెడ్యూల్‌‌లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని ప్లాన్ చేశారట. ఇది కాక కకుడా, డబుల్ ఎక్సెల్ చిత్రాల్లోనూ నటిస్తోంది సోనాక్షి.