పంజాగుట్ట నిమ్స్ లో టెక్నికల్ పోస్టులు..ఆగస్టు 9 లాస్ట్ డేట్

పంజాగుట్ట నిమ్స్ లో  టెక్నికల్ పోస్టులు..ఆగస్టు 9 లాస్ట్ డేట్

హైదరాబాద్​లోని నిజాం ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ మెడికల్ సైన్సెస్(నిమ్స్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్స్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఈ ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.  ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 09. 

పోస్టుల సంఖ్య: 41. 
పోస్టులు: మెడికల్ జనటిక్స్ 01, న్యూరోసర్జరీ(ఐఓఎన్ఎం) 01, న్యూక్లియర్ మెడిసిన్ 03, బీఎంఈ 01, వెస్కులర్ సర్జరీ 01, ఈఎండీ 01, పాథాలజీ 02, పల్మొనాలజీ 05, నెఫ్రాలజీ 04, కార్డియాలజీ 06, మైక్రోబయాలజీ 04, బయోకెమిస్ట్రీ 05, అనస్తీషియాలజీ 07.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత టెక్నాలజీ కోర్సుల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 35 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా. ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ నిజామ్స్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ మెడికల్ సైన్సెస్, 
పంజాగుట్ట, హైదరాబాద్ చిరునామాకు అప్లికేషన్లు పంపించాలి. 
లాస్ట్ డేట్: ఆగస్టు 09.  
అప్లికేషన్ ఫీజు: రూ. 1000. 
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు nims.edu.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.