నాగ్పూర్లోని ఓ కంపెనీలో పేలుడు, 9మంది మృతి

నాగ్పూర్లోని ఓ కంపెనీలో పేలుడు, 9మంది మృతి

మహారాష్ట్ర : నాగ్పూర్లోని పేలుడు పదార్థాల తయారీ కంపెనీలో పేలుడు సంభవించింది. నాగ్ పూర్ కు 55 కిలోమీటర్లు దూరంలో ఉన్న బజార్ గ్రామంలో సోలార్ పేలుడు పదార్థాల తయారీ కంపెనీలు ఈ ఘటన చోటు చేసుకుంది. కాస్ట్ బూస్టర్ ప్లాంట్ లో ప్యాకింగ్ ప్రక్రియలో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మందికి తీవ్ర గాయాలయినట్లు తెలుస్తోంది.మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.  

పేలుడుకు గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. పేలుడు జరిగిన సమయంలో కిలోమీటర్ల దూరంలో వారికి భారీ శబ్ధం వినిపించిందని స్థానికులు చెప్పారు. ఈ పేలుడుతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఎప్పుడు ఏం జరుగుతుందోని  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. 
  
పేలుడు ధాటికి కంపెనీలోని ఒక భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులను ప్రమాద స్థలం నుంచి రక్షించి ఆస్పత్రికి తరలించామని నాగ్ పూర్రూలర్ పోలీస్ సూపరింటెండెంట్ తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంకా ఎక్కువ మంది లోపల చిక్కుకొని ఉండవచ్చని ఎస్పీ తెలిపారు. 

బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల సాయం ప్రకటించిన  డిప్యూటీ సీఎం  

ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు మహారాష్ర్ట ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇచ్చారు. ఈ ఘటనపై దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు.