చెక్​ బౌన్స్ కేసులో.. తొమ్మిదేండ్ల జైలు శిక్ష

చెక్​ బౌన్స్ కేసులో.. తొమ్మిదేండ్ల జైలు శిక్ష
  • తీర్పు వెలువరించిన మల్కాజిగిరి కోర్టు

నేరేడ్​మెట్, వెలుగు: చెక్​బౌన్స్ కేసులో మూసారాంబాగ్​కు చెందిన శ్రీహరి అనే వ్యక్తికి తొమ్మిదేండ్ల జైలు విధిస్తూ మల్కాజిగిరి కోర్టు తీర్పు వెలువరించింది. వ్యాపారం కోసం శ్రీహరికి నేరేడ్​మెట్​కు చెందిన సురేశ్ 2005 నుంచి 2015 వరకు విడతల వారీగా రూ.3 కోట్లు అప్పుగా ఇచ్చాడు. శ్రీహరి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో సురేశ్ 2016లో కోర్టును ఆశ్రయించాడు. దీంతో లోక్ అదాలత్​లో తాను ఇవ్వాల్సిన అప్పును తిరిగి చెల్లిస్తానని కోర్టుకు శ్రీహరి చెక్కులు అందజేశాడు. అవి బౌన్స్ అయ్యాయి. 

బాధితుడు సురేశ్ మళ్లీ కోర్టుకెళ్లాడు. 2018లో నిందితుడు శ్రీహరికి తొమ్మిదేండ్ల జైలు శిక్ష విధిస్తూ మల్కాజిగిరి కోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ శ్రీహరి హైకోర్టు, సుప్రీం కోర్టు దాకా వెళ్లినా చుక్కెదురైంది. దీంతో శ్రీహరిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.