సంగారెడ్డి పట్టణంలోని చెరువులో చేప పిల్లలు వదిలిన నిర్మల జగ్గారెడ్డి

సంగారెడ్డి పట్టణంలోని చెరువులో చేప పిల్లలు వదిలిన నిర్మల జగ్గారెడ్డి

సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి పట్టణంలోని మెహబూబ్ సాగర్ చెరువులో బుధవారం టీజీఐఐసీ చైర్​పర్సన్​నిర్మలా జగ్గారెడ్డి, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తో కలిసి చేప పిల్లలను వదిలారు. వారు మాట్లాడుతూ మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలో భవిష్యత్​లో మత్స్యకారుల సంక్షేమానికి మరిన్ని కార్యక్రమాలు చేపడుతామని చెప్పారు. కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు ,మత్స్య సహకార సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.