అదంతా తప్పుడు ప్రచారం..బైకులపై టోల్ ట్యాక్స్ లేదు: నితిన్ గడ్కరీ

 అదంతా తప్పుడు ప్రచారం..బైకులపై టోల్ ట్యాక్స్ లేదు: నితిన్ గడ్కరీ

టూవీలర్స్​పై టోల్​ టాక్స్​అంటూ బాగా ప్రచారం జరుగుతోంది. జూలై 15 నుంచి టూవీలర్స్ పై టోల్ గేట్లదగ్గర ట్యాక్స్​ వసూలు చేయనున్నారని సోషల్​మీడయాలో న్యూస్​ వైరల్​ అవుతోంది. దీంతో వాహనదారులు గందరగోళంలో పడ్డారు. టూవీలర్స్​ టోల్​ ట్యాక్స్​ వసూలుపై కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ క్లారిటీ గురువారం (జూన్​ 26) ఇచ్చారు.

 జూలై15 నుంచి టూవీలర్స్​ పై టోల్​ ట్యాక్స వసూలు చేస్తారనేది తప్పుడు ప్రచారం.. అవన్నీ  ఊహాగానాలు.. పుకార్లు అంటూ కేంద్ర మంత్రినితిన్​ గడ్కరి కొట్టిపారేశారు. కొన్ని మీడియా సంస్థలు ఇలాంటి వార్తలను ప్రసారం చేస్తున్నాయని నితిన్​ గడ్కరీ సోషల్ మీడియా ప్లాట్​ ఫాం Xలో రాశారు. 

📢 महत्वपूर्ण

कुछ मीडिया हाऊसेस द्वारा दो-पहिया (Two wheeler) वाहनों पर टोल टैक्स लगाए जाने की भ्रामक खबरें फैलाई जा रही है। ऐसा कोई निर्णय प्रस्तावित नहीं हैं। दो-पहिया वाहन के टोल पर पूरी तरह से छूट जारी रहेगी। बिना सच्चाई जाने भ्रामक खबरें फैलाकर सनसनी निर्माण करना स्वस्थ…

— Nitin Gadkari (@nitin_gadkari) June 26, 2025

టూవీలర్స్​ పై టోల్​ ట్యాక్సు వేసే  ఎలాంటి ప్రతిపాదన లేదని నేను స్పష్టం చేస్తున్నాను.. బైకుల టోల్​పై పూర్తి రాయితీ కొనసాగుతుందని అన్నారు. నిజం తెలియకుండా తప్పు దారి పట్టించే వార్తనుల వ్యాప్తి చేయడం, సంచలనాలు సృష్టించడం ఆరోగ్యకరమైన జర్నలిజానికి సంకేతం కాదు.. దీనిని నేను ఖండిస్తున్నానన్నారు నితిన్​ గడ్కరీ. 

జూలై 18న కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్​ గడ్కరీ సోషల్​ మీడియాలో ఫాస్టాగ్​ పాస్​ పథకాన్ని ప్రకటించారు. జాతీయ రహదారులపై సజావుగా ,ఇబ్బంది లేని ప్రయాణం వైపు ఇది ఒక ముంద డుగు అని ఆయన అన్నారు. ఈ పాస్ ఫీజు, డ్యూరేషన్​, డిస్టన్స్​ ఇతర నిబంధనలపై ఆయన సమాచారం ఇచ్చారు. 

మెట్రో నగరాల్లోని రోజువారీ కార్యాలయ ప్రయాణికులు టోల్ ప్లాజాల వద్ద టోల్ పన్ను చెల్లించడానికి మళ్ళీ మళ్ళీ పొడవైన క్యూలలో నిలబడకుండా సహాయపడే పథకం అని చెప్పారు నితిన్​ గడ్కరీ. 

మరోవైపు నేషనల్​ హైవే అథారిటీ ఆఫ్​ ఇండియా కూడా టూవీలర్స్​ పై ట్యాక్స్​పై క్లారిటి ఇచ్చింది. అదంతా ఫేక్​ న్యూస్​ అని తేల్చింది. టూవీలర్స్​ ట్యాక్స్​ విధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తోందని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తునాయి. అటువంటి ప్రపోజల్​ఏదీ ప్రభుత్వం దృష్టిలో లేదని స్పష్టం చేసింది.  

#FactCheck: Some sections of the media have reported that the Government of India plans to levy user fees on two-wheelers. #NHAI would like to clarify that no such proposal is under consideration. There are no plans to introduce toll charges for two-wheelers. #FakeNews

— NHAI (@NHAI_Official) June 26, 2025