బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసిన నితిన్ నబీన్

 బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసిన నితిన్ నబీన్

న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం 2026, జనవరి 19న ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. ఈ క్రమంలో పార్టీ నెక్ట్స్ చీఫ్ రేసులో ముందు వరుసలో ఉన్న బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నితీన్ నబిన్ నామినేషన్ వేశారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో నబిన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జి కిషన్ రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్ సహా సీనియర్ మంత్రులు హాజరయ్యారు. 

Also Read : రాబోయే పది రోజులు ముంబై విడిచి వెళ్లొద్దు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొని నబిన్‎కు మద్దతు తెలిపారు. ప్రధాని మోడీ, అమిత్ షా ఆశీస్సులు మెండుగా ఉండటంతో తదుపరి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితీన్ నబిన్ ఎన్నిక లాంఛనమేనని కాషాయ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. జనవరి 19వ తేదీ రాత్రి అధికారికంగా అధ్యక్షుడు పేరును బీజేపీ ప్రకటించనుంది.