IND vs ENG 2025: కెప్టెన్ వికెట్ అంటే ఇది: నితీష్‌తో గిల్ సూపర్ ప్లాన్ అదుర్స్

IND vs ENG 2025: కెప్టెన్ వికెట్ అంటే ఇది: నితీష్‌తో గిల్ సూపర్ ప్లాన్ అదుర్స్

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పట్టు సంపాదించింది. నాలుగో రోజు ఆటలో భాగంగా చక చక మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ ను కష్టాల్లోకి నెట్టింది. నాలుగో రోజు నితీష్ కుమార్ రెడ్డి తీసిన వికెట్ హైలెట్ గా మారుతుంది. గిల్ కెప్టెన్సీ, నితీష్ సూపర్ బాల్ కారణంగా ఈ  వికెట్ వచ్చింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో గిల్ ఆశ్చర్యకరంగా ఆకాష్ దీప్ కంటే నితీష్ ను ముందుగా బౌలింగ్ కు తీసుకొచ్చాడు. అంతేకాదు వికెట్ కీపర్ ను ముందుకు తీసుకొని వచ్చి నితీష్ చేత బౌలింగ్ చేయించాడు. 

గిల్ చేసిన ఈ ప్రయోగం ఫలించింది. 15 ఓవర్ ఐదో బంతికి నితీష్ రెడ్డి బాల్ ను ఆడబోయిన క్రాలీ (22) గాలిలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ సిరీస్‌లో కొన్ని క్యాచ్‌లను వదిలివేసిన జైస్వాల్.. ఈ సారి ఎలాంటి తప్పు చేయకుండా అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. క్రాలీని ఒత్తిడిలో పడేసిన గిల్.. చివరకు వికెట్ తీసి సక్సెస్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 50 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.  

వికెట్ నష్టపోకుండా 2 పరుగులతో నాలుగో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ అంతకముందు బెన్ డకెట్, పోప్ వికెట్లను కోల్పోయింది. ఈ రెండు వికెట్లను సిరాజ్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 61 పరుగులుచేసింది. క్రీజ్ లో బ్రూక్ (5), రూట్ (11) ఉన్నారు. భారత బౌలర్లలో సిరాజ్ రెండు నితీష్ కుమార్ తలో వికెట్ తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 387 పరుగులు చేయగా.. ఆతర్వాత ఇండియా కూడా సరిగ్గా 387 పరుగులు చేసింది.