
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్(ఎన్ఐటీటీఆర్) జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జూన్ 24.
పోస్టుల సంఖ్య: 12
పోస్టులు: సీనియర్ లైబ్రేరియన్ 01, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ 01, టెక్నికల్ ఆఫీసర్ 03, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (హిందీ ట్రాన్స్లేటర్) 01, టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్–II (కన్సోల్ ఆపరేటర్) 01, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(స్టెనోగ్రాఫర్) 02, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
(జేఎస్ఏ) 02, టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్–II(కెమెరా మ్యాన్) 01.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఏ, బీటెక్ లేదా బీఈ, 12వ తరగతి, ఎంఈ లేదా ఎంటెక్, మాస్టర్ ఆఫ్ లైబ్రేరియన్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 35ఏండ్ల నుంచి 45 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: జూన్ 12.
సాలరీ: నెలకు 19900-208700
పూర్తి వివరాలకు NITTE.gov.inలో సంప్రదించగలరు.
►ALSO READ | ఐఐఐటీ తిరుపతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు