V6 News

ఘనంగా నిజాం కాలేజీ కాన్వొకేషన్

 ఘనంగా నిజాం కాలేజీ కాన్వొకేషన్

బషీర్ బాగ్, వెలుగు: నిజాం కాలేజీ మూడో కాన్వొకేషన్​బుధవారం రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది.  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ బాసుత్కర్ జగదీశ్వర్ రావు, ఓయూ వీసీ మొలుగారం  కుమార్  పాల్గొని స్టూడెంట్లకు పట్టాలు ప్రదానం చేశారు. నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి.భీమా మాట్లాడుతూ.. 49 మంది విద్యార్థులు గోల్డ్ మెడల్స్ కు ఎంపిక కాగా ఇందులో 80% అమ్మాయిలేనన్నారు. ఒక అమ్మాయి 6 గోల్డ్  మెడల్స్ సాధించిందని పేర్కొన్నారు.