ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ స్కూళ్లలో బోధన  :    డీఈవో అశోక్

ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ స్కూళ్లలో బోధన  :    డీఈవో అశోక్

వర్ని, వెలుగు: ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నామని నిజామాబాద్​డీఈవో అశోక్ కుమార్ అన్నారు. రుద్రూర్ లోని పీఎంశ్రీ ఎంపీపీఎస్ ను శనివారం ఆయన సందర్శించారు. విద్యార్థులకు డిజిటల్ క్లాసులు అందించేందుకు గ్లోబల్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ అందించిన ప్రొజెక్టర్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యాబోధనతో పాటు మంచి భోజనం అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ ఇందూరు సునీత, ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, ఎంఈవో శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.