నిజామాబాద్, వెలుగు: ఇంటర్ఫలితాల్లో నిజామాబాద్కాకతీయ విద్యాసంస్థల ఆధ్వర్యంలోని జూనియర్కాలేజీ స్టూడెంట్స్ఉత్తమ మార్కులు సాధించగా వారిని డీఈవో సన్మానించారు. సెకండియర్ఎంపీసీలో ఎం.మృదుల 996 మార్కులతో టాపర్గా నిలిచింది. బైపీసీలో తుబాఫాతిమా 993 మార్కులు సాధించింది. ఎంపీసీలో బి.కావ్యశ్రీ 993, వై.గౌతమి 991, బైపీసీలో హనియ ఉమేమ 991 మార్కులు తెచ్చుకున్నారు.
కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమానికి డీఈవో అశోక్కుమార్హాజరై 984 కంటే ఎక్కువ మార్కులు సాధించిన 12 మందిని, ఇంటర్ ఫస్టియర్లో468 కంటే ఎక్కువ మార్కులు స్కోర్చేసిన తొమ్మిది మందిని సన్మానించారు. కాకతీయ విద్యా సంస్థల చైర్పర్సన్ విజయలక్ష్మి, డైరెక్టర్లు రజినీకాంత్, తేజస్విని, రామోజీరావు, రాజు తదితరులు పాల్గొన్నారు.

