
- బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని బీఆర్ఎస్ యోచన
- కవితకే టికెట్ ఇవ్వాలని స్థానిక నేతల డిమాండ్
- లోక్‌సభ సన్నాహక సమావేశంలో స్పందించని అధిష్టానం
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నిజామాబాద్ఎంపీ టికెట్డౌటేనని తెలుస్తోంది. ఆ స్థానం నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. ఇటీవల నిర్వహించిన నిజామాబాద్లోక్సభ సన్నాహక సమావేశంలో స్థానిక నాయకులందరూ కవితకే టికెట్ఇవ్వాలని డిమాండ్‌చేశారు. 2019 ఎన్నికల్లో కవిత ఓటమి తర్వాత అందుకు దారితీసిన పరిస్థితులపై అధిష్టానం కనీసం సమీక్ష కూడా చేయలేదని ఆ సమావేశంలో నాయకులు మండిపడ్డారు. ఆ సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత.. ఎమ్మెల్యేల వ్యవహార శైలితోనే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీఓడిపోయిందని, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని కుండబద్దలు కొట్టారు. ఈ సమావేశం తర్వాతే కవితకు నిజామాబాద్ఎంపీ టికెట్దారులు మూసుకుపోయినట్టుగా పార్టీ ముఖ్య నేతల మధ్య చర్చ జరుగుతోంది. లోక్‌సభ టికెట్కవితకే ఇవ్వాలని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు డిమాండ్చేసినా.. పార్టీ అధిష్టానంఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కరీంనగర్, చేవెళ్ల, ఖమ్మం లోక్‌సభ అభ్యర్థులుగా వినోద్‌కుమార్, రంజిత్‌రెడ్డి, నామా నాగేశ్వర్రావుల పేర్లను ఆయా లోక్‌సభ సన్నాహక సమావేశాల వేదికపై నుంచే ప్రకటించారు. రంజిత్ రెడ్డికి టికెట్ఇవ్వాలని కోరుతూ సన్నాహక సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశామని నేతలు ప్రకటించారు. ఈ ముగ్గురు నేతల కన్నా నిజామాబాద్ఎంపీ టికెట్కవితకు ఇవ్వాలని ఎక్కువ మంది కోరారు. సమావేశానికి హాజరైన కార్యకర్తలు కొందరు రాతపూర్వకంగా కూడా ఇదే విషయం చెప్పారు. కానీ పార్టీ అధిష్టానంమాత్రం ఆమెను లోక్‌సభకు పోటీ చేయించే ఆలోచనలో లేనట్టుగా తెలుస్తోంది.