నిజామాబాద్ జిల్లాలోని వలపు వలతో బ్లాక్ మెయిలింగ్

నిజామాబాద్ జిల్లాలోని వలపు వలతో బ్లాక్ మెయిలింగ్
  •     రేప్ కేసులు పెట్టిస్తామని నగదు లూటీ
  •     భార్యాభర్తల గలీజ్  దందా   

నిజామాబాద్, వెలుగు: చీకటి పడ్డాక పురుషులను ఆకర్షించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి రేప్​ కేసు పెట్టిస్తానని నిలువు దోపిడీ చేస్తున్న మహిళ, ఆమెకు సహకరిస్తున్న భర్తను నిజామాబాద్​ రూరల్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆదివారం సీఐ శ్రీనివాస్​ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని నాందేడ్​ జిల్లా ముఖేడ్​ ప్రాంతానికి చెందిన మంగేష్కర్​ గైక్వాడ్, ఉజ్వల భార్యభర్తలు. కాస్మోటిక్  బిజినెస్​ చేస్తూ నిజామాబాద్​లోని మాధవ్​నగర్​లో కిరాయి ఇంట్లో ఉంటున్నారు. ఈజీ మనీ సంపాదించడానికి సిద్ధమయ్యారు. 

ప్రతి రోజు సాయంత్రం చీకటి పడ్డాక ఉజ్వల సిటీలోని ముఖ్య కూడళ్ల మీదుగా ఒంటరిగా బైక్​లపై వెళ్తున్న పురుషులను అసభ్య సైగలతో అట్రాక్ట్​ చేసి, వారి బైక్​పై కూర్చొని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లేది. రేప్​ కేస్​ పెట్టిస్తానని బెదరగొట్టేది. అప్పటికే వారిని అనుసరిస్తూ అక్కడికి చేరుకున్న భర్తతో కలిసి నిలువు దోపిడీ చేసేవారు. ఈ గలీజ్​ దందాను వృత్తిగా మార్చుకున్న దంపతులపై నిఘా పెట్టి శనివారం రాత్రి పట్టుకున్నామని సీఐ తెలిపారు.