నిజామాబాద్....సంక్షిప్త వార్తలు

నిజామాబాద్....సంక్షిప్త వార్తలు
  • ప్రొటెక్షన్ పేరిట నిబంధనలకు నీళ్లు
  • ఇష్టారీతిగా ఏడీఈ, ఏఈల ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్లు
  • ఎస్ఈ, జేఏసీ నాయకుల తీరుపై ఉద్యోగుల ఆగ్రహం 

నిజామాబాద్ : నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ సర్కిల్‌‌‌‌‌‌‌‌ విద్యుత్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగుల బదిలీల్లో నిబంధనలను పాతరేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏడీఈ, ఏఈల పోస్టుల బదిలీలు, పోస్టింగ్‌‌‌‌‌‌‌‌లలో ముడుపుల భాగోతం నడిచినట్లు తెలుస్తోంది. మరో వైపు ప్రొటెక్షన్ పద్ధతిని పరిగణలోకి తీసుకోవడం కూడా వివాదస్పదంగా మారుతోంది. ఇందూరు సర్కిల్ చరిత్రలోనే  మహిళా ఉద్యోగులు ఏకంగా ఆందోళనకు దిగడం అవినీతిపై చర్చకు దారి తీస్తోంది. జులై 7న ఉద్యోగుల బదిలీపై షెడ్యూల్ విడుదలైన విషయం తెల్సిందే. గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా బదిలీలను నిలిపివేశారు. కానీ ఈ నెల 13న సీనియారిటీ జాబితాను ప్రదర్శించారు. అందులో సీఎండీ పరిధిలోని 96 మంది ఏడీఈలు, 256 నుంచి 300 వరకు ఏఈలు ఉన్నారు. జాబితాలో జనరల్ బదిలీల్లో మూడేళ్ల కాలపరిమితి పూర్తి చేసుకున్న అధికారులను బదిలీ చేయాలని స్పష్టంగా ఉంది. దాని ప్రకారం నిజామాబాద్, కామారెడ్డి సర్కిళ్లలో ఈ నెల 18న బదిలీల ఉత్తర్వులు వచ్చాయి. అది చూసి సంబంధిత శాఖ ఏడీఈ, ఏఈలే ఖంగుతిన్నారు. మే, జూన్‌‌లో జరిగిన స్వీపర్లు, అటెండర్లు, ఎల్‌‌‌‌‌‌‌‌డీసీ, యూడీసీ, జేఏవోల మాదిరిగానే నిజామా బాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇష్టానుసారంగా బదిలీ చేశారు. అయితే జూన్ మాసంలో అడ్డురాని మహిళా ఉద్యోగుల ప్రొటెక్షన్ బదిలీలు ఆపరేషన్ టెక్నికల్, ఇంజినీర్ సెక్షన్లకు వచ్చే సరికి అమలు చేయాల్సి రావడం పెద్ద దుమారాన్ని రేపింది. రెండు రోజుల కింద మహిళా ఉద్యోగులు ఎస్ఈ, జేఏసీ నాయకుల తీరుకు నిరసనగా విద్యుత్ ప్రగతి భవన్ ముందు ఆందోళనకు దిగారు. టీఎస్ ఎన్పీడీసీఎల్ పరిధిలో ఎక్కడా లేని విధంగా నిజామాబాద్ సర్కిల్ పరిధిలో జరిగిన బదిలీల వ్యవహారం పలు అనుమానాలకు దారితీసింది.  

జరిగిందిలా ..
నిజామాబాద్ సర్కిల్‌‌‌‌‌‌‌‌లో 8 మంది ఏడీలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నలుగురు, నిజామాబాద్ నుంచి 20 మంది ఏఈలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఐదుగురు ఏఈలకు పోస్టింగ్‌‌‌‌‌‌‌‌లు ఇచ్చారు. సర్కిల్ పరిధిలో 8 మంది ఏడీలు ఉండగా వారిలో నలుగురు ఏడీలు రిక్వెస్ట్‌‌‌‌‌‌‌‌పై వచ్చి చేరారు. అప్పటి వరకు 8 మంది ఏఈల బదిలీలు జనరల్ బదిలీల్లో జరుగుతాయని అధికారులు ప్రకటించి సీనియర్ జాబితాను తయారు చేశారు. అందులో నిజామాబాద్ నుంచి నలుగురు ఏడీఈలు కచ్చితంగా బయట ప్రాంతాలకు వెళ్లాల్సిందేనని చర్చ జరిగింది. నిజామాబాద్ సిటీ మీటర్స్‌‌‌‌‌‌‌‌లో ఏడీఈకి ప్రొటెక్షన్ పరంగా నిజామాబాద్ రూరల్ ఏఈగా పోస్టింగ్​ ఇచ్చారు. నిజామాబాద్ ఏడీఈ స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న అధికారిని సిటీ మీటర్స్‌‌‌‌‌‌‌‌లో నియమించారు. ఏడీఈ హెచ్‌‌‌‌‌‌‌‌టీ మీటర్స్‌‌‌‌‌‌‌‌లో ఉన్న అధికారిని భీంగల్‌‌‌‌‌‌‌‌కు పోస్టింగ్ ఇచ్చారు. ఏడీఈ కన్ స్ట్రక్షన్‌‌‌‌‌‌‌‌లో ఉన్న అధికారికి ఎడపల్లికి ఇచ్చారు. ఏడీఈ ఎస్‌‌‌‌‌‌‌‌పీఎంగా ఉన్న వ్యక్తికి సేమ్ హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ వచ్చే డిచ్‌‌‌‌‌‌‌‌పల్లికి పోస్టింగ్ ఇచ్చారు. నిజామాబాద్ టౌన్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఏడీఈకి నందిపేట్‌‌‌‌‌‌‌‌కు పోస్టింగ్ ఇచ్చారు. ఇందులో జనరల్ బదిలీని బేస్‌‌‌‌‌‌‌‌గా చేసుకుని జరగలేదనే ఆరోపణలున్నాయి. నిజామాబాద్ నుంచి కచ్చితంగా నలుగురు బదిలీ కావాల్సిన  సమయంలో అందుకు విరుద్ధంగా ప్రొటక్షన్ పేరిట పోస్టింగ్ ఇవ్వడం కలకలం రేపింది. అదే విధంగా ఏఈల విభాగంలో కమర్షియల్లో ఏఈగా ఉన్న అధికారిని నిజామాబాద్ డీ 2 ఏఈ గా, బాన్సువాడలో కమర్షియల్‌‌‌‌‌‌‌‌లో ఉన్న అధికారిని నిజామాబాద్ డివిజన్‌‌‌‌‌‌‌‌లోని టెక్నికల్ ఏడీఈగా పోస్టింగ్ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

ప్రొటక్షన్ పేరిట పోస్టింగ్‌‌‌‌‌‌‌‌లు..
గత కొంత కాలంగా వివిధ సంఘాల్లో పని చేసిన వారిని బదిలీ సమయం వచ్చే సరికి అధ్యక్ష, కార్యదర్శులుగా చూపుతూ లేఖలు ఇవ్వడంతో వారు ప్రొటక్షన్ పొంది పోస్టింగ్‌‌‌‌‌‌‌‌లు పొందుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఇటీవల జరిగిన బదిలీల్లోనూ త్వరలోనే పదవి విరమణ చేస్తున్నామని కొందరు, ప్రొటక్షన్ల పేరిట పోస్టింగ్‌‌‌‌‌‌‌‌లను సంబంధిత డివిజన్లు దాటిపోలేదని తెలుస్తోంది. జూన్‌‌లో జరిగిన నాన్ టెక్నికల్ ఉద్యోగుల బదిలీల్లో లేని ప్రొటెక్షన్ టెక్నికల్‌‌‌‌‌‌‌‌కు వచ్చే సరికి ఏ విధంగా ఇచ్చారనిపలువురు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఈ పోస్టింగ్‌‌‌‌‌‌‌‌ల వ్యవహారంలో భారీగా ముడుపులు ముట్టినట్లు కూడా ఆరోపణలు 
చేస్తున్నారు.

కుమ్మక్కైన లీడర్లు, ఆఫీసర్లు..?
ఉద్యోగులు, అధికారుల బదిలీల వ్యవహారంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు, సర్కిల్ అధికారి కుమ్మక్కయ్యారని ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ప్రొటక్షన్ పోస్టింగ్‌‌‌‌‌‌‌‌లే కాకుండా మహిళా అధికారుల పేరిట నగరంలోని సేమ్ హెచ్ఆర్ఏ వచ్చే పోస్టింగ్‌‌‌‌‌‌‌‌లకు ఏ విధంగా ఇస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఏకంగా కిందిస్థాయి మహిళా ఉద్యోగులు గురువారం రాత్రి వెలువడిన పోస్టింగ్ ఉత్తర్వులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనరల్ విభాగంలో బదిలీ కాకుండా ఉండాల్సిన తమను కన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్ ఏడీఈ లక్ష్మణ్ నాయక్ ఏకంగా తనను ఎడపల్లికి నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారని మానవ హక్కులు సంఘాన్ని, జాతీయ ఎస్టీ కమిషన్‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు ప్రకటించారు. కనీసం బదిలీలు, పోస్టింగ్‌‌‌‌‌‌‌‌ల విషయంలో అధికారుల అభిప్రాయాన్ని తీసుకోలేదని మండిపడ్డారు. ప్రొటక్షన్ కోరి విద్యుత్ ఉద్యోగుల సంఘాలు, జేఏసీ నాయకులు ఇచ్చిన లేఖల ఆధారంగా పోస్టింగ్‌‌‌‌‌‌‌‌లు ఇవ్వడంపై ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు.

తిండి గింజల కోసం...
ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు తెస్తున్నా అర్హులకు చేరకపోవడంతో చాలా కుటుంబాలు తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నాయి. ఒక్క పూట తిండి కోసం వారు పడే బాధలు వర్ణణాతీతం.. నిజామాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్‌‌‌‌లో ఆదివారం బియ్యం లోడ్‌‌‌‌తో వచ్చిన గూడ్స్ రైలు ఆన్‌‌‌‌ లోడింగ్‌‌‌‌ చేశారు. ఆ టైంలో బస్తాల నుంచి నేలరాలిన బియ్యాన్ని ఓ వృద్ధురాలు ఇలా ఏరుకుంటూ కనిపించింది. 

ఘనంగా జగన్నాథ యాత్ర...
నందిపేట మండల కేంద్రంలో ఆదివారం జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహించారు. కేదారీశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగి రాములు మహారాజ్ ఆధ్వర్యంలో ఈ యాత్ర ప్రారంభించారు. స్థానిక కృష్ణవేణి స్కూల్ నుంచి ప్రధాన వీధుల గుండా సాగిన స్వామివారి ఊరేగింపులో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరే రామ.. హరే రామ.. హరే కృష్ణ .. హరే కృష్ణ..’ అంటూ ఇస్కాన్​ భక్తులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నాగమంతెన వాడలోని కల్యాణ మండపంలో అన్నదానం నిర్వహించారు. - నందిపేట, వెలుగు

మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడాలి...
మాక్లూర్, వెలుగు: ప్రతీ ఇంటి పనిసరాల్లో చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌‌‌‌‌‌‌‌రావు పిలుపు నిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం మాక్లూర్​ మండలంలోని చికిలిలో మెగా పార్కులో మొక్కలు నాటారు. చెట్ల వల్ల మానవాళికి అనేక ఉపయోగాలున్నాయని ఆయన వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో క్రాంతి, ఎంపీవో శ్రీనివాస్, ఏపీవో అనీల్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్థానిక సర్పంచ్​ ప్రమీల, ఎంపీటీసీలు కారం సుజాత, పురుషోత్తంరావు, ఉప సర్పంచ్ గుండు రవి, వార్డు మెంబర్లు, నాయకులు ఆశావర్కర్లు, అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ టీచర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్...
కామారెడ్డి, వెలుగు: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ చెప్పారు. యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్‌‌‌‌లో కలెక్టర్​ మాట్లాడుతూ యోగా  ప్రతీ ఒక్కరి జీవితంలో భాగం కావాలన్నారు. ఈ సందర్భంగా జూనియర్, సీనియర్  లెవల్స్‌‌‌‌లో  వేర్వేరుగా జరిగిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రతిభ చాటిన శివాయిపల్లి ప్రైమరీ స్కూల్​స్టూడెంట్లు సంప్రీత్‌‌‌‌రెడ్డి, అంకిత్, జిల్లెల శ్రీమాన్య స్టేట్ లెవల్ పోటీలకు ఎంపికయ్యారు. కార్యక్రమంలో డీఈవో రాజు, యోగా అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ గడ్డం రాంరెడ్డి, ప్రతినిధులు గరిపల్లి అంజయ్య, అంతిరెడ్డి, పి.అంజయ్య, రఘుకుమార్, సిద్దాగౌడ్,  విఠల్‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.  

భావితరాల కోసం మొక్కలు నాటాలి...
భావితరాల కోసం ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాల్సిన అవసరముందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సీనియర్​ సిటీజన్ ఫోరం బిల్డింగ్ ఆవరణలో ఆయన కలెక్టర్ జితేష్​ వి పాటిల్‌‌‌‌తో కలిసి మొక్కలు నాటారు.  అనంతరం మాట్లాడుతూ మొక్కలు నాటడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్​ దొత్రే, ఉర్దూ ఆకాడమీ స్టేట్ చైర్మన్ ముజీబుద్దీన్, మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్​ నిట్టు జాహ్నవి, ఆఫీసర్లు పాల్గొన్నారు.  

తల్లీపిల్లలను కాపాడిన పోలీసులు...
మెండోరా, వెలుగు: ఆర్మూర్‌‌‌‌‌‌‌‌లోని రాజారాంనగర్ కాలనీకి చెందిన షేక్ పర్షాద్ (42)  ఆదివారం తన ముగ్గురు పిల్లలతో కలిసి ఎస్సారెస్పీ డ్యాం వద్ద కాకతీయ కాల్వలో దూకి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. గమనించిన పర్యాటకులు డయల్‌‌‌‌ 100కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు అదే ఏరియాలో ఉన్న మెండోరా పీఎస్ బ్లూ కోల్ట్స్‌‌ సిబ్బంది రాకేశ్‌‌‌‌, నరేశ్‌‌‌‌ తెలుపడంతో వారు తల్లీపిల్లలను కాపాడారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని తేలడంతో ఆమె భర్త తాహెర్‌‌‌‌‌‌‌‌ను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లీ పిల్లలను రక్షించిన పోలీసు సిబ్బందిని ఎస్సై శ్రీనివాస్, స్థానికులు అభినందించారు.

యువకుడి అవయవదానం...
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీడీ కార్మిక కాలనీకి చెందిన రాజు ( 19)  యాక్సిడెంట్‌‌‌‌లో  గాయపడి చికిత్స పొందుతూ చనిపోయాడు. యువకుని అవయవాలను ఫ్యామిలీ మెంబర్స్ దానం చేశారు. కాలనీకి చెందిన కొందరు యువకులు హైదరాబాద్​ నుంచి డీసీఎం వ్యాన్‌‌‌‌లో గణపతిని తీసుకుని వస్తుండగా మార్గమధ్యంలో  5 రోజుల కింద యాక్సిడెంట్​ జరిగింది. డీసీఎం వ్యాన్‌‌‌‌ను లారీ ఢీకొట్టడంతో  డీసీఎంలో ఉన్న రాజు, భరత్, లక్ష్మణ్‌‌‌‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో రాజుకు బ్రెయిన్ డెడ్ అయ్యింది.  ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌‌‌‌లోని ఓ హాస్పిటల్‌‌‌‌లో చనిపోయిన యువకుడి అవయవాలను దానం చేశారు. మిగతా ఇద్దరు చికిత్స పొందుతున్నారు.  

ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటా..డీసీసీబీ చైర్మన్‌‌‌‌ భాస్కర్‌‌‌‌‌‌‌‌రెడ్డి
వర్ని : పార్టీ కోసం శ్రమిస్తున్న కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటానని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌‌‌‌‌‌‌‌రెడ్డి తెలిపారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అర్థరాత్రి అయినా అందుబాటులో ఉంటానని బీజేపీ చిల్లెర చేష్టలకు ఎవరు భయపడ వద్దన్నారు. మండలంలోని ఎస్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌ పురం పంచయతీ పరిధిలోని కోటయ్య క్యాంపునకు చెందిన టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌ సతీశ్‌‌‌‌ను డీసీసీబీ చైర్మన్ ఆదివారం పరామర్శించారు. కొద్ది రోజుల కింద బీజేపీకి చెందిన కొందరు ఆకతాయిలు సతీశ్‌‌‌‌ను వేధింపులకు గురిచేయడాన్ని ఖండించారు. రాజకీయంగా టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ఎదుర్కోలేకనే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నారు. ఆయన వెంట వర్ని మండల నాయకులు, ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.

బోధన్ డిపో ముందు మహిళా కండక్టర్ల ధర్నా
బోధన్ : ఆర్టీసీలో స్పెషల్​ఆఫ్‌‌‌‌ డ్యూటీలను తొలగిస్తూ.. డే అవుట్ డ్యూటీలు చేయాలని యాజమాన్యం జీవో విడుదల చేయడాన్ని నిరసిస్తూ బోధన్ ఆర్టీసీ డిపో ముందు మహిళా కండక్టర్లు ఆదివారం రాత్రి ధర్నాకు దిగారు. వీరికి సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు. పాత పద్ధతిలోనే స్పెషల్ ​ఆఫ్‌‌‌‌ డ్యూటీలు ఇవ్వాలని డిమాండ్ ​చేశారు. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించరారు.  సీపీఎం నాయకులు గంగాధరప్ప, మహిళా కండక్టర్లు పాల్గొన్నారు.  

లివర్‌‌‌‌‌‌‌‌ మార్పిడికి ఆర్థిక సాయం...

వర్ని : మండలంలోని తగిలేపల్లికి చెందిన ప్రశాంత్, సుధ దంపతుల కూతురుకు లివర్ మార్పిడి ఆపరేషన్ కోసం వాక్ టు సర్వ్ ద నేషన్ ఆర్గనైజేషన్ వారు ఆదివారం రూ.40 వేల సాయాన్ని అందజేశారు.  ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు నవీన్ కమలవార్ మాట్లాడుతూ ‘మనిషి కోసం.. మనిషి’ అనే నినాదంతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్న వారు ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో బాధితులకు ఆర్థిక సాయం అందజేయాలని కోరారు. కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షుడు భానుప్రసాద్, బాలయ్య, ప్రతినిధులు శ్రీనివాస్, రాజు, శంకర్, నాగరాజు పాల్గొన్నారు.