
జనగామలో మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) అనుతిచ్చింది. ఇటీవల ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్ లకు అనుమతి వచ్చింది. దీంతో ఈ ఏడాదికి గాను అనుమతులు ఐదుకు చేరాయి. మరో నాలుగు కాలేజీల అనుమతుల ప్రక్రియ చివరి దశలో ఉంది.
జనగామలో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ప్రభుత్వం అనుమతివ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరీశ్ రావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో 100పడకల ఆసుపత్రికి శంకుస్థాపన సహా ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. గతేడాది 8, ఈ ఒక్క ఏడాదిలో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ధ్యేయంగా పెట్టుకున్నారని చెప్పారు. తెలంగాణ వచ్చాక మెడికల్ విద్యలో ముందడుగు వేశామన్నారు. విద్యార్థులు ఇక ఏ దేశాలకు వెళ్లి చదువుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు.