చైనా ఎయిర్ పోర్టులో భారతీయ మహిళ నిర్భంధం..తిండిలేక18 గంటలు నరకయాతన

చైనా ఎయిర్ పోర్టులో భారతీయ మహిళ నిర్భంధం..తిండిలేక18 గంటలు నరకయాతన

చైనా షాంఘై ఎయిర్ పోర్టులో భారతీయ మహిళ నిర్భంధం.. పాస్ పోర్టు చెల్లదంటూ అవమానించారు. తిండిలేదు.. కనీసం కమ్యూనికేషన్ కోసం ఫోన్ లేదు..ఇంటర్నెట్ ఇవ్వలేదు..18 గంటలు నరకం చూపించారు.షాంఘై ఇమ్మిగ్రేషన్ అధికారులు తీరుకు ఆ మహిళ షాక్.. ఆమె పట్ల ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎందుకు అలా బిహేవ్ చేశారు..?

ప్రేమా థాంగ్ డాక్..అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన మహిళ. లండన్ లో ఉంటోంది.. చైనా మీదుగా జపాన్ వెళ్లే క్రమంలో చైనా షాంఘై ఎయిర్ పోర్టులో దిగింది. అయితే అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు  ఆమెను 18 గంటల పాటు నిర్భంధించారు. పాస్ పోర్టు చెల్లదంటూ కొర్రీలు పెట్టారు. కనీసం ఆహారం కూడా ఇవ్వలేదని థాంగ్ డాక్ ఆరోపించింది. 

థాంగ్ డాక్ నిర్భంధాని కారణం.. 

థాంగ్ డాక్ అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన మహిళ కావడం.. ఇండియన్ పాస్ పోస్టు ను కలిగి ఉండటమే ఆమె నిర్భంధానికి కారణం అయింది. థాంగ్ చెప్పిన దాని ప్రకారం... అరుణాచల్ చైనా లో అంతర్భాగం.. భారత్ పాస్ పోర్టు ఎలా తీసుకుంటారని ఇమ్మిగ్రేషన్ వాదించారు. ఇక ఇమ్మిగ్రేషన్ అధికారుల తీరు, తాను అనుభవించిన బాధను  థాంగ్ సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా షేర్ చేసింది. 
ప్రేమా థాంగ్ డాక్  నిర్భంధం భారత్ విదేశాంగ శాఖ సీరియస్ స్పందించింది. అరుణాచల్ భారత్ లో భాగం..  చైనా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాస్తవం.. అని సీరియస్ గా చైనాకు వార్నింగ్ ఇచ్చింది. 

ALSO READ : ఈ పాన్, ఆధార్ కార్డులు అసలా.. నకిలీనా..? 

థాంగ్ డాక్ నిర్భంధంపై చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు స్పందిస్తూ.. ఇమ్మిగ్రేషన్ రూల్స్ ప్రకారమే ఆమెను చెక్ చేశాం .. ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు అంటూ చెప్పుకొచ్చారు.

ఆగస్టు 31, 2025న టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం తర్వాత భారత ,చైనా నేతలు సమావేశం అనంతరం రెండు దేశా ల మధ్య విమాన కనెక్టివిటీ ని పున ప్రారంభించారు. సరిహద్దుల్లో వివాదం ..ఐదేళ్ల విరామం తర్వాత ఐదు సంవత్సరాల విరామం తర్వాత చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ నవంబర్ 9 నుంచి  షాంఘై- ఢిల్లీ విమానాల సర్వీస్ ను ప్రారంభించింది. అయితే థాంగ్ డాక్ నిర్బంధంతో చైనా రూల్స్  ను అతిక్రమించిందని భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జైశ్వాల్ విమర్శించారు. అన్ని దేశాల పౌరులు వీసాలేకుండా 24 గంటలు ప్రయాణ నిబంధనలను ఉల్లంఘించిందన్నారు జైశ్వాల్.