ఈ పాన్, ఆధార్ కార్డులు అసలా.. నకిలీనా..? గూగుల్ AI తో అచ్చుగుద్దినట్లు చేసి చూపించిన టెకీ..

ఈ పాన్, ఆధార్ కార్డులు అసలా.. నకిలీనా..? గూగుల్ AI తో అచ్చుగుద్దినట్లు చేసి చూపించిన టెకీ..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)  చేస్తున్న వింతలు చూసి సంతోషపడాలో, బాధ పడాలో తెలియని పరిస్థితి ప్రస్తుత సమాజానిది. అది చేస్తున్న సాంకేతిక మార్పులు, మాయాజాలం ప్రపంచాన్ని మరో దశకు తీసుకెళ్తుందని భావిస్తున్న తరుణంలో.. వ్యక్తిగత, సామాజిక భద్రతకు ఏఐ విసురుతున్న సవాళ్లను చూస్తే ఆందోళన చెందక తప్పని పరిస్థితి. ఏఐ ద్వారా పొంచి ఉన్న భద్రతా పరమైన ముప్పును కళ్లకు కట్టినట్లు చూపించాడు ఓ టెకీ. రెగ్యులర్ గా వాడే ఆధార్, పాన్ కార్డులను అచ్చుగుద్దినట్లు చేసి చూపించి సవాల్ విసిరాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా ఇది వైరల్ గా మారింది. 

బెంగళూరుకు చెందిన టెకీ ఏఐ మిస్ యూజ్ పై చేసిన సవాల్ ఇప్పుడు పెద్ద డిబేట్ గా మారింది. గూగుల్ ఏఐ (Google AI) టూల్ అయిన నానో బనానా (Nano Banana) తో ఎలాంటి చట్ట విరుద్ధమైన పనులు చేయొచ్చో చేసి చూపించాడు. ఏఐ ని వినియోగించి అచ్చుగుద్దినట్లు, రియల్ కార్డులకంటే క్లారిటీతో ఆధార్, పాన్ కార్డులను రూపొందించాడు ఈ టెకీ. 

హర్వీన్ సింగ్ చద్ధా అనే ఐటీ ప్రొఫెషన్.. ఫేక్ ఫాన్, ఆధార్ కార్డులతు తయారు చేసేందుకు ఏఐ మోడల్ ను వినియోగించుకున్నాడు. ఫేక్ కార్డును తయారు చేయడమే కాకుండా.. తన పేరుకు బదులుగా కాస్త వ్యంగ్యంగా ట్విట్టర్ ప్రీత్ సింగ్ అనే పేరుతో కార్డును తయారు చేశాడు. కార్డులకు సంబంధించి లోగో, క్యూ ఆర్ కోడ్ లను కూడా ఎలాంటి డౌట్ రాకుండా చాలా క్లారిటీగా చేసి ఎక్స్ లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు చెప్పండి మన భద్రతకు భరోసా ఏంటో.. అంటూ సవాల్ విసిరాడు. 

నానో బనానా చాలా బాగుంది. కానీ దానితో సమస్య కూడా ఉంది. అది ఫేక్ ఐడెంటిటీ కార్స్ ను తయారు చేస్తుంది. చలా పర్ఫెక్ట్ గా, రియలిస్టిక్ గా తయారు చేస్తుంది. ఇమేజ్ వెరిఫికేషన్ సిస్టమ్స్ కూడా ఫెయిల్ అయ్యేలా.. అంత కచ్చితమైన కార్డులను తయారు చేస్తుంది.. అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశాడు. 

అడ్వాన్సుడ్ ఏఐ టూల్స్ ఎలా మిస్ యూజ్ చేయవచ్చో ఇది ఒక ఉదాహరణ. ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసే వాళ్లు దీన్ని వాడుకుంటే ఎంత ప్రమాదమో.. ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు, చర్యలు తీసుకుంటుందోననే ప్రశ్నలు మొదలయ్యాయి. 

సోషల్ మీడియాలో డిబేట్:

ఏఐ టూల్స్ నుంచి వ్యక్తిగత భద్రతను కాపాడేందుకు తక్షణమే కచ్చితమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే గూగుల్ జెమినీలో ఏఐ ఇమేజెస్ స్కాన్ చేసే పదుపాయం ఉందని.. SynthID అనే ఈ ఫీచర్ ద్వారా చెక్ చేస్తే ఫేక్ లేదా నిజమైనదా అనేది తేలిపోతుందని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. అయితే ప్రతి ఐడీ కార్డును జెమినీ యాప్ లో స్కాన్ చేయలేరు అని హర్వీన్ రెస్పాండ్ అయ్యాడు. 

ఫేక్ క్యూఆర్ కోడ్స్, ప్యాటర్న్స్ తయారు చేస్తున్న ఏఐ నుంచి ఫేక్ ఏదో ఒరిజినల్ ఏదో గుర్తించే మెకానిజం ఎక్కడుంది అని మరో యూజర్ ప్రశ్నించాడు. హోటల్, ఎయిర్ పోర్ట్ లో ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు వాళ్లు నిజంగా స్కాన్ చేస్తున్నారా..? అది అన్ని వేళలా సాధ్యం కాదు కదా..? అలాంటప్పుడు పెద్ద ప్రమాదమే రావచ్చుకదా అని ప్రశ్నిస్తున్నారు.