ఇంజనీరింగ్ స్టూడెంట్లకు క్లాసుల్లేవ్.. ఓన్లీ ల్యాబులే

ఇంజనీరింగ్ స్టూడెంట్లకు క్లాసుల్లేవ్.. ఓన్లీ ల్యాబులే

హైదరాబాద్, వెలుగు: ఫిబ్రవరి ఫస్ట్ నుంచి జేఎన్టీయూ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫిజికల్ క్లాసులు నిర్వహించడం లేదు. ఆ నెలంతా ల్యాబ్​లు మాత్రమే నిర్వహించాలని జేఎన్టీయూహెచ్ నిర్ణయించింది. ఫిబ్రవరి ఫస్ట్ నుంచి అన్ని కాలేజీల్లో ఫిజికల్ క్లాసులు ప్రారంభించాలని సర్కారు నిర్ణయించినా జేఎన్టీయూ పరిధిలోని ఇంజనీరింగ్​తో పాటు ఇతర ప్రొఫెషనల్ కోర్సుల్లో కొన్ని నెలలుగా ఆన్​లైన్​ క్లాసులు కొనసాగుతున్నాయి. దాదాపు సిలబస్​ పూర్తయింది. ల్యాబులు చేయాల్సిన టైమ్ వచ్చింది. ఫిబ్రవరిలో రెండు విడుతల్లో ల్యాబులు, ఇంటర్నల్స్, వైవా పూర్తి చేసేందుకు ఇప్పటికే షెడ్యూల్ రెడీ చేశారు. ఫిబ్రవరి ఫస్ట్ నుంచి13 వరకు థర్డ్, ఫోర్త్ ఇయర్స్​ స్టూడెంట్స్​కు, 15 నుంచి 27 వరకు ఫస్టియర్, సెకండియర్స్​కు ల్యాబ్స్​కొనసాగుతాయి. మార్చి 8 నుంచి 20 వరకు సెమిస్టర్స్ ఎగ్జామ్స్ పెట్టేందుకు అధికారులు రెడీ అయ్యారు. స్టూడెంట్స్​ ఇంటి దగ్గరలోని కాలేజీలో సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసుకునేలా మరోసారి చాన్స్​ ఇచ్చినట్టు రిజిస్ట్రార్ మంజూర్​ హుస్సేన్ తెలిపారు. ఫస్టియర్స్​కు మినహా మిగిలిన మూడేండ్ల స్టూడెంట్స్​కు ఫస్ట్ సెమిస్టర్స్ మార్చి 20లోగా పూర్తి చేస్తామని చెప్పారు. ఓయూ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ థియరీ క్లాసులు దాదాపు పూర్తికావడంతో ముందుగా థర్డ్, ఫోర్త్ ఇయర్స్ స్టూడెంట్స్​ల్యాబులు నిర్వహించాలని భావిస్తున్నారు.

For More News..

పీఆర్సీ రిపోర్ట్​ను లీక్​ చేసినోళ్లు దొరికిన్రు

తల్లి శవాన్ని పదేళ్లు ఫ్రిజ్‌​లో దాచిన కూతురు

రాహుల్ వంట.. అదిరేనంట.. యూట్యూబ్ లో వీడియో వైరల్