కో ఆప్షన్​ మెంబర్లు లేరు.. వార్డు కమిటీలు లేవు​!

కో ఆప్షన్​ మెంబర్లు లేరు.. వార్డు కమిటీలు లేవు​!

రెండు మీటింగ్​లతోనే సరి
కరోనా సాకుతో నెట్టుకొస్తున్న కౌన్సిల్​
ప్రభుత్వ ఆదేశాలకు అధికారుల వెయిటింగ్

హైదరాబాద్​, వెలుగు: బల్దియా కౌన్సిల్ ఏర్పడి ఏడాది పూర్తవగా, ఇప్పటివరకు రెండే మీటింగ్​లు జరిగాయి. గతేడాది ఫిబ్రవరి11న కొత్త కౌన్సిల్ ఏర్పడగా మేయర్ గా గద్వాల్​ విజయలక్ష్మి , డిప్యూటీ మేయర్ గా మోతె శ్రీలత రెడ్డి ఎన్నికయ్యారు.  రెండు జనరల్​బాడీ మీటింగ్​ల్లో ఒకటి గతేడాది జూన్ 29న వర్చువల్​ గా, మరొకటి డిసెంబర్ 4న జరిగాయి. ఇందులో సభ్యులు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వపోవడంతో ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  ప్రతి3 నెలలకోసారి నిర్వహించాల్సిన జనరల్​బాడీ మీటింగ్​ను కూడా  కరోనా సాకుతో పెట్టడడంలేదు. దీనిపైన ప్రతిపక్ష సభ్యులు ప్రతిసారి ఆందోళన చేస్తున్నా మేయర్ పట్టించుకోకపోగా కమిషనర్ ను కలిసి కౌన్సిల్​పెట్టాలని కూడా డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు జనరల్ బాడీ మీటింగ్​ఏర్పాటు చేయకపోతుండగా పలుమార్లు ఆందోళనలు నిర్వహించారు.   ప్రస్తుతం గ్రేటర్ సమస్యలపై చర్చలే లేవు. 
కో ఆప్షన్ సభ్యులెక్కడ.. 
కౌన్సిల్​ఏర్పడిన రెండు నెలల్లోపు కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక కంప్లీట్ కావాల్సి ఉండగా, ఇప్పటివరకు నియామకమే లేదు. గతేడాది మార్చిలో నోటిఫికేషన్​ఇచ్చి, ఆ తర్వాత వెంటనే రద్దు చేశారు. ఐదుగురు కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండగా, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోగా నిలిపేసినట్లు తెలిసింది. స్టాండింగ్​ కమిటీ సభ్యులను కూడా  కౌన్సిల్​ఏర్పడిన 9 నెలలకు గతేడాది నవంబర్16 న ఎన్నుకున్నారు. 

వార్డు సభ్యుల ఎన్నిక అంతే.. 
గ్రేటర్‌లో 150 డివిజన్లులుండగా, బల్దియా యాక్ట్‌ మేరకు కౌన్సిల్​ఏర్పడిన తర్వాత వెంటనే పాలనలో పౌరుల భాగస్వామ్యం మరింత పెంచేందుకు వార్డు కమిటీలను నియమించాలి.  కౌన్సిల్ ​ఏర్పడినా ఇప్పటివరకు  ఎంపిక చేయలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకనే కమిటీలను నియమించడం లేదు.  ఒక్కో వార్డు కమిటీలో100 మంది సభ్యులను ఎన్నుకోవాలి.  గ్రేటర్​లో మొత్తం15వేల సభ్యులకు అవకాశం ఉంది. ప్రతిసారి నామమాత్రంగా 10 నుంచి 15 మందిని ఎన్నుకొని పక్కన పెట్టేస్తుండగా కమిటీ లక్ష్యం నెర వేరడంలేదు. 

మరిన్ని వార్తల కోసం..

కోఠి ఆస్పత్రిలో కోటి సమస్యలు

కేసీఆర్​ అవినీతి లెక్కలు తీస్తం